NTV Telugu Site icon

Saudi Arabia: ఎడారి దేశంలో మంచు వర్షం.. ఎంజాయ్ చేస్తున్న స్థానికులు

Soudhi

Soudhi

Saudi Arabia: గల్ఫ్‌ దేశమైన సౌదీ అరేబియా అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఎడారి. అక్కడ విపరీతమై ఎండలు మండిపోతాయి. అయితే, ప్రస్తుతం అక్కడ క్రమంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఎడారి దేశంలోని పలు ప్రాంతాల్లో చరిత్రలోనే తొలిసారి భారీగా మంచు వర్షం కురుస్తుంది. రోడ్లపై తెల్లటి తివాచీలా పేరుకుపోయిన మంచును చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Read Also: Rajanna Sircilla: బరితెగించిన కాంట్రాక్టర్‌.. కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని తీసుకెళ్లి నిర్బంధం..

ఇక, సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో కనుచూపు మేర మంచు దుప్పటి కప్పేసింది. అయితే, ఈ ప్రాంతం ఏడాదంతా పొడి వాతావరణంలో కనిపిస్తుంది. శుష్క వాతావరణానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వర్షాలు పడటం, మంచు కురవడం ఇక్కడ సాధ్యం కాదు. అలాంటిది చరిత్రలో మొట్టమొదటిసారి ఇక్కడ తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా మంచు కురుస్తుంది. ఎడారి రోడ్లపై మంచును చూసి స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు.

Read Also: Supreme Court: ఉద్యోగ నియామకాల సమయం మధ్యలో రూల్స్ మార్చడానికి వీల్లేదు..

అయితే, వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పుపై యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం రియాక్ట్ అయింది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా రాబోయే రోజుల్లో వడగళ్ల వానలు, బలమైన గాలుల, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, రాబోయే రోజుల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలను జారీ చేసింది. సుదీర్ఘ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని స్థానికులకు సూచనలు జారీ చేసింది.