Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక

  • సౌదీ లక్ష్యంగా హౌతీలు దాడులు
  • అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
  • పలు కీలక సూచనలు జారీ చేసిన ప్రభుత్వం
Soudi

Soudi

పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇరాన్ మద్దతుతో హౌతీలు.. సౌదీ అరేబియాపై దాడులు ఉధృతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరులకు సౌదీ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. వంతెనలు, ఎత్తైన భవనాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక హౌతీల దాడులను సౌదీ అరేబియా కేబినెట్ తీవ్రంగా ఖండించింది. సౌదీ భద్రత, దాని భూభాగ పరిరక్షణ విషయంలో రాజీ పడబోమని కేబినెట్ పేర్కొంది.

పౌరులకు సూచనలు..

ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం తెలిపింది. ఇళ్లల్లోనే ఉండాలని.. కిటికీలకు దూరంగా ఉండాలని కోరింది. బహిరంగ ప్రదేశాలు, గాజు కిటికీలు, బాల్కనీలు, ఇంటి పైకప్పులకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ బయట ఉంటే సమీపంలోని భవనంలో ఆశ్రయం పొందాలని పేర్కొంది. సౌదీ అరేబియాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు మక్కా ఒక పవిత్ర నగరం. గత కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని వివిధ లక్ష్యాలపై దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది.