Site icon NTV Telugu

Saudi Arabia: సౌదీలో బయటపడిన భారీ బంగారు నిక్షేపాలు

Saudi Arabia

Saudi Arabia

Saudi Arabia Announces Discovery Of Huge Gold And Copper Deposits: పెట్రోలియమే కాదు.. ఇకపై బంగారంలోనూ సౌదీ అరేబియా తన మార్కును చాటుకోనుంది. పవిత్ర నగరమైన మదీనాలో బంగారం, రాగి ఖనిజాలకు సంబంధించి భారీ బంగారు నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. మదీనా ప్రాంతంలోని అబా అల్ – రహా సరిహద్దుల్లో బంగార నిక్షేపాలను కనుక్కున్నట్లు సౌదీ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మదీనాలోని వాడి అల్-ఫరా, అల్-మాదిక్ ప్రాంతంలోని నాలుగు ప్రదేశాల్లో రాగి నిక్షేపాలను కనుగొన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిక్షేపాలు వెలుగులోకి రావడంతో ప్రపంచం నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని.. సౌదీ జియోలాజికల్ సర్వే సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది. రాగి, బంగారం నిక్షేపాలు పెట్టుబడులను ఆకర్షిండంతో పాటు సౌదీ జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతాయని భావిస్తున్నారు. కొత్తగా వెలుగులోకి వచ్చిన నిక్షేపాలు 53.3 కోట్ల డాలర్ల పెట్టుబడులను కలిగి ఉందని.. దాదాపుగా 4 వేల ఉద్యోగాలను సృష్టించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Read Also: Telangana Congress: మళ్లీ రగడ.. నిన్న ప్రియాంక గాంధీకి కోమటిరెడ్డి లేఖ.. నేడు ఈడీ నోటీసులు!

తాజాగా కనుగొన్న నిక్షేపాలు సౌదీలో మైనింగ్ రంగంలో గుణాత్మక పురోగతిని తెస్తుందని.. పెట్టుబడి అవకాశాలను మెరుగుపరుస్తుందని.. పెట్టుబడుల కోసం అవకాశాలను తెరుస్తామని సౌదీ చెబుతోంది. సౌదీలోని 5,300 మినరల్ లోకేషన్లు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ జనవరిలో తెలిపారు.

సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు ముడిచమురే ఆయువు పట్టు. అయితే భవిష్యత్తులో చమురు నిల్వలు అడుగంటిపోతే ఎలా అనే సందేహాలు సౌదీని వెన్నాడుతున్నాయి. దీంతో సౌదీ ఎకానమిని ఇతర రంగాల్లోకి విస్తరించాలని అక్కడి పాలకులు భావిస్తున్నారు. పర్యాటకం, ఇతర రంగాల్లో అభివృద్ధి చెందాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇతర ఖనిజాల కోసం పరిశోధనలు జరుపుతున్నారు.

Exit mobile version