Salman Rushdie On Ventilator: ప్రముఖ రచయిత, బుకర్ ఫ్రైజ్ అవార్డ్ గ్రహీత, భారత సంతతి బ్రిటన్ పౌరుడు సల్మాన్ రష్డీపై శుక్రవారం దుండగుడు దాడి చేశారు. ఓ సభలో ప్రసంగిస్తున్న సమయంలో దుండగుడు కత్తి పోట్లకు గురయ్యారు. రష్దీ ఓ పుస్తక ఆవిష్కరణ సభలో ఉండగా ఈ దాడి జరిగింది. పదికి పైగా కత్తిపోట్లకు గురైనట్లు తెలుస్తోంది. మెడపై తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కాలేయం కత్తిపోట్లతో దెబ్బతింది. చేతులో నరాలు తెగడంతో పాటు ఓ కన్ను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సల్మాన్ రష్దీ వెంటిలేటర్ పై ఉన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని న్యూజెర్సీ ఫెయిర్ వ్యూకు చెందిన 24 ఏళ్ల వ్యక్తి హదీ మటర్ గా గుర్తించారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
1947లో ముంబయిలోని ఓ కాశ్మీరీ కుటుంబంలో జన్మించారు సల్మాన్ రష్దీ. ఆ తరువాత బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నారు. ఆ తరువాత 2016లో యూఎస్ పౌరసత్వాన్ని పొందారు.. ప్రస్తుతం అమెరికాలోనే జీవిస్తున్నారు. రష్టీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రఖ్యాత బుకర్ ప్రైజ్ దక్కింది. ఈయన 1980లో రాసిన ‘ ది సాతానిక్ వర్సెస్’ నవల వివాదాస్పదం అయింది. ఈ బుక్ పై పలు ముస్లిం సంఘాల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు రష్దీ. రష్టీని హతమారస్తామని బెదిరింపులు వచ్చాయి.
Read Also: Montenegro: కుటుంబ కలహాలతో కాల్పులు.. పిల్లలతో సహా 12 మంది మృతి
ముఖ్యంగా ఇరాన్ ఈ పుస్తకాన్ని బ్యాన్ చేసింది. కొందరు ముస్లిం దేశాలు ఈ బుక్ లో ముస్లిం వ్యతిరేక అంశాలు ఉన్నాయని.. దైవదూషణ ఉందని ఆరోపించాయి. మెజారిటీ ముస్లిం దేశాల్లో ఈ బుక్ ను బ్యాన్ చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా రహెల్లా ఖొమేనీ.. సల్మాన్ రష్దీపై ఫత్వాను కడూా జారా చేశాడు. ముస్లింలకు వ్యతిరేకంగా దైవదూషణకు పాల్పడిన వ్యక్తిని చంపాలని పిలుపునిచ్చాడు. ఇరాన్ ప్రభుత్వం మద్దతు ఉన్న చాలా సంస్థలు రష్దీని చంపడానికి నిధులను కూడా సేకరించాయి.
