Site icon NTV Telugu

Russsia-Ukraine War : పాఠశాలపై రష్యా బాంబు దాడి.. 60 మంది మృతి..

School Attack

School Attack

రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య వార్‌ నడుస్తూనే ఉంది. 73 రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం కాగా.. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అయితే.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా ధాటిని ఉక్రెయిన్ సైన్యం అడ్డుకుంటోంది. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. అయితే.. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోయి.. జనావాసాలను సైతం లెక్క చేయకుండా.. పునరావాస భవనాలపైనా దాడులు చేస్తోంది.

తాజాగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఓ పాఠశాల భవనంపై రష్యా వైమానిక బలగాలు బాంబులను వర్షం కురిపించాయి. ఈ ఘటనలో 60 మంది మరణించి ఉంటారని తెలిపిన లుహాన్స్క్ రీజియన్ గవర్నర్ సెర్హీ హైదీ.. దాదాపు 400 మంది గాయపడినట్లు తెలిపారు. యుద్ధం ఆరంభమైన తరువాత ఈ స్కూల్ భవనాన్ని షెల్టర్‌జోన్‌గా అక్కడి ప్రభుత్వం మార్చింది. అయితే.. 95 మంది వరకు స్థానికులు ఇక్కడ తలదాచుకుంటుండగా.. ఈ భవన సముదాయంపై రష్యా వైమానిక బలగాలు బాంబులను సంధించినట్లు సైర్హీ హైదీ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలను చేపట్టామని 30 మందికి కాపాడగలిగామని అన్నారు.

Exit mobile version