రష్యా- ఉక్రెయిన్ వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారేలా కనిపిస్తున్నది. ఇప్పటికే నాటో, అమెరికా బలగాలు పెద్ద ఎత్తున మొహరిస్తున్నాయి. నాటో దళాలకు అండగా ఉండేందుకు మాత్రమే తమ దళాలను పంపుతున్నట్లు అమెరికా చెబుతున్నది. ఫిబ్రవరి 16 వ తేదీన ఉక్రెయిన్ పై దాడికి దిగేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నదని అమెరికా వాదిస్తున్నది. రష్యా దాడులకు సంబంధించి తమ దగ్గర పక్కాసమారం ఉందని అమెరికా చెబుతున్నది. రష్యా తన జలాల్లో లైవ్ వార్ ట్రయల్స్ నిర్వహణ దానికోసమేనని చెబుతున్నది. ఇక ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన ఓ జలాంతర్గామి రష్యా జలాల్లోకి ప్రవేశించంది.
Read: Dettadi Harika: అలా పిలిస్తే గుడ్డలూడదీసి కొడతా..
ఈ విషయాన్ని గుర్తించిన రష్యా సబ్‌మెరైన్ డిస్ట్రాయిర్ మార్షల్ షాపోష్నికోవ్ అమెరికా జలాంతర్గామిని గుర్తించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆ జలాంతర్గామిని అనుసరించడంతో అక్కడి నుంచి అమెరికా జలాంతర్గామి వెనక్కి వెళ్లిపోయింది. దీనిపై రష్యాలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని వివరణ కోరింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ సమీపంలోని కురిల్ దీవులు రష్యా ఆదీనంలో ఉన్నాయి. ఈ దీవుల సమీపంలో అమెరికా జలాంతర్గామిని గుర్తించింది. అంతర్జాతీయ జలాల్లో తమ కార్యకలాపాలను సురక్షితంగా కొనసాగిస్తామని అమెరికా చెబుతున్నది.
