Russia Ukraine War: దాదాపు 5నెలలుగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్‌లో ఖార్కివ్ ప్రాంతంలోని చుహుయివ్ పట్టణంలో రష్యా సైనికులు బాంబు దాడి చేశారు. దీని ఫలితంగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని ఉక్రెయిన్ అధికారులు అనుమానిస్తున్నారు. దాడి సమయంలో ధ్వంసమైన సాంస్కృతిక కేంద్రం బంకర్‌లో అనేక మంది పౌరులు దాక్కున్నారని ఖార్కివ్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ హెడ్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను రక్షించినట్లు ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ సిన్యెహుబోవ్ వెల్లడించారు.
కొరోబోచ్‌కైన్ గ్రామం, పెచెనిహి పట్టణంలోని నివాస ప్రాంతాలు కూడా అనేకసార్లు బాంబు దాడికి గురయ్యాయని సిన్యెహుబోవ్ చెప్పారు. బోహోదుఖివ్, ఇజియం పట్టణాలపై కూడా బాంబు దాడి జరిగిందని గవర్నర్ తెలిపారు. గతంలో దురదృష్టవశాత్తూ, కులినిచి అనే గ్రామంలో 39 ఏళ్ల ట్రాక్టర్ డ్రైవర్ పేలుడు పదార్థాన్ని గుర్తించకుండా అక్కడికి వెళ్లడంతో అది పేలి మరణించాడని సిన్యెహుబోవ్ చెప్పారు. అధికారులు, సైనిక సిబ్బంది పొలాల్లో పరిశీలించి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించిన తర్వాతే ఖార్కివ్ ప్రాంతంలోని రైతులు పొలాల్లో పని చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Partha Chatterjee: కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు
ఫిబ్రవరిలో వారి ప్రారంభ సైనిక చర్యలో రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతమైన ఖేర్సన్‌ను సెప్టెంబర్ నాటికి కైవ్ దళాలు తిరిగి తీసుకుంటాయని ఉక్రేనియన్ అధికారి ప్రకటించిన ఒకరోజు అనంతరం రష్యన్ దళాలు బాంబు దాడి చేయడం గమనార్హం.