NTV Telugu Site icon

Russia-Ukraine War: ప్రెస్‌మీట్‌లో ఉండగా హయ్యర్ ఆఫీసర్ ఫోన్ కాల్! వీడియో వైరల్

Russia

Russia

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఉధృతం అయింది. గత రాత్రి ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. రెండేళ్ల యుద్ధంలో ఇలాంటి క్షిపణిని ప్రయోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్‌లో ఉండగానే హఠాత్తుగా అత్యున్నత స్థాయి మగ అధికారి నుంచి ఫోన్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన దృశ్యాలు మైక్‌లు వినిపించాయి. క్షిపణి ప్రయోగంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించాడు. అందుకు ఆమె సరేనంటూ ఫోన్ పెట్టేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Pakistan: చైనా కోసం.. బలూచ్ వేర్పాటువాదులపై పాక్ ఆర్మీ యాక్షన్..

ఉక్రెయిన్‌పై అణు రహిత ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్‌ని రష్యా ప్రయోగించింది. రెండేళ్లలో ఉక్రెయిన్‌పై ఈ క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి. రాత్రిపూట ఈ క్షిపణిని ప్రయోగించింది. డ్నిప్రో నగరాన్ని తాకినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ ధృవీకరించింది.

ఏ రకమైన క్షిపణి ప్రయోగించారో ఇప్పటి వరకు రష్యా స్పష్టంగా ప్రకటన చేయలేదు. కానీ ఉక్రెయిన్ వైమానిక దళం మాత్రం గురువారం టెలిగ్రామ్‌లో రష్యాలోని ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఇలాంటి క్షిపణి ప్రయోగించడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇప్పటికే రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు రంగంలోకి దిగాయి. తాజా యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా దాడులతో రష్యా యుద్ధాన్ని తీవ్రతరం చేసినట్లుగా తెలుస్తోంది. డ్నిప్రో నగరానికి భారీ నష్టం జరిగినట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి: Spotless Face Tips: ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం కావాలంటే ఈ పద్ధతులను అనుసరిస్తే సరి

ఇదిలా ఉంటే రష్యా దాడులను అమెరికా ముందుగానే పసిగట్టింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి కార్యాలయాన్ని మూసివేశారు. అమెరికాతో పాటు ఇటలీ, స్పెయిన్‌ సహా పలు దేశాలు ఎంబసీ కార్యాలయాలను మూసివేశారు. రష్యా దాడులకు ఉక్రెయిన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతుగా నిలిచింది. భారీ ఆయుధాలను సరఫరా చేస్తోంది. తాజా యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి.