NTV Telugu Site icon

Ukraine Russia War: పుతిన్‌ కీలక ప్రకటన

Putin

Putin

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సిటీలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. వరుగా సిటీలను స్వాధీనం తీసుకుంటూ ముందుకు సాగుతోంది.. ఇక, ఉక్రెయిన్ కీల‌క న‌గ‌రాల్లో ఒక‌టైన మేరియుపోల్ త‌మ వ‌శ‌మైయింద‌ని తాజాగా ప్రకటించారు ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దేశా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో పుతిన్‌ మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విజయంగా అభివర్ణించారు.. మిమ్మల్నందరినీ అభినందిస్తున్నా.. ఇక ఆ ప్రాంతంపై దాడులు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు పుతిన్‌.

Read Also: Blasts: వరుస పేలుళ్లు.. ఐదు ప్రాంతాల్లో బాంబుల మోత..

కాగా, ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. అప్పటి నుంచి మేరియుపోల్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తూ వస్తున్నాయి రష్యా బలగాలు.. అదే స్థాయిలో ఉక్రెయిన్‌ నుంచి ప్రతిఘటన ఎదురవుతూ వచ్చింది.. ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు… ఇరు దేశాల సైనికులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.. అయితే, ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడంతో రష్యా కీలక విజయం సాధించినట్టు అయ్యింది.. మేరియుపోల్ రష్యా ఆధీనంలోకి వెళ్లిపోవడంతో క్రిమియా, డాన్ బాస్ మధ్య భూమార్గంలో రాకపోకలకు రష్యాకు ఉన్న అన్ని ఇబ్బందులు తొలగిపోనున్నాయి.. అయితే, యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యన్ దళాలు ఈ ఆగ్నేయ నగరాన్ని ముట్టడించాయి.. దానిని చాలా వరకు ధ్వంసం చేశాయి.. అయితే, ఉక్రెయిన్‌ దళాలు మొండిగా పోరాటం చేశాయి.. ఇటీవల వారు విశాలమైన ఉక్కు కర్మాగారంలో ఉన్నారు.. మరియు రష్యన్ దళాలు.. వారంతా లొంగిపోవాలని ఆదేశిస్తూ పదేపదే అల్టిమేటంలు జారీ చేశాయి.. మొత్తంగా ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకున్నట్ఉ పుతిన్‌ వెల్లడించారు.