ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం పదో రోజుకు చేరుకుంది… ఐదున్నర గంటల తాత్కాలిక విరమణ తర్వాత మళ్లీ భీకర యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. రష్యాపై ఆంక్షలు విధించడం యుద్ధంతో సమానం అన్నారు పుతిన్.. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.. ఉక్రెయిన్‌పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్… ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని సమర్థించుకున్న ఆయన.. శాంతియుతంగా సమస్య పరిష్కారానికి రష్యా ప్రయత్నించిందని తెలిపారు. కానీ, ఉక్రెయిన్ దీనికి అడ్డంకులు సృష్టించిందని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు పుతిన్… రష్యాకు ముప్పుగా పరిణమించిన ఉక్రెయిన్‌ను సైనిక, అణ్వాయుధ రహితంగా చేస్తామన్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని, ఊహించిన దాని కన్నా మరింత భీకరంగా యుద్ధం ఉంటుందని హెచ్చరించారు పుతిన్.
Read Also: Russia-Ukraine War: మళ్లీ కాల్పుల మోత..
మా డిమాండ్లు నెరవేరే వరకు యుద్ధం ఆగని స్పష్టం చేశారు.. ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామన్న ఆయన.. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందన్నారు. ఉక్రెయిన్‌పై నో ఫ్లై జోన్ విధించే ఏ ప్రయత్నమైనా రష్యాపై యుద్ధంగా పరిగణిస్తామని పుతిన్ హెచ్చరించారు. నాటో నిర్ణయాల వల్లనే ఉక్రెయిన్‌పై తాము దాడికి దిగినట్లు తెలిపారు పుతిన్.. రష్యాపై ఆంక్షలు విధించిన నాటో కూడా తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు.
