Ukraine War: ఏడాదిన్నరగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. పాశ్చాత్య దేశాలు ముఖ్యంగా యూరోపియన్ దేశాలు, అమెరికా ఆంక్షలకు భయపడకుండా పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. మరోవైపు పాశ్చాత్య దేశాలను నమ్ముకుని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తన దేశాన్ని నాశనం చేసుకుంటున్నారు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని వారాల్లోనే రష్యా లొంగిపోతుందని అనుకున్నప్పటికీ.. అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడా తదితర దేశాలు ఇచ్చే సాయంతో ఏడాదిన్నగా ఉక్రెయిన్ పోరు సాగిస్తుంది.
Read Also: Largest Kidney Stone: కిడ్నీలో రాయి కాదు పెద్ద బండ.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్
ఇదిలా ఉంటే యుద్ధంలో రష్యా కీలక నిర్ణయం తీసుకోబోతోంది. యుద్ధంలో రష్యా తరుపున పోరాడేందుకు అనుమానిత దోషులు, నేరస్థులతో ఒప్పందం చేసుకునేందుకు రక్షణ మంత్రిత్వశాఖను అనుమతించే చట్టాన్ని, రష్యా దిగువసభలో బుధవారం ప్రవేశపెట్టనున్నారు. రష్యా పార్లమెంట్ దాదాపుగా ఈ చట్టానికి అనుమతి ఇవ్వనుంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూరప్ లో పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడానికి రష్యా అడుగులు వేస్తోంది.
నేరాలు చేసిన వ్యక్తి విచారణ జరుగుతున్న సందర్భంలో, కోర్టులో హియరింగ్ ఉండీ, లేకపోతే నేరస్థుడిగా నిర్ధారించబడి తీర్పు చెప్పని కేసుల్లో ఉన్న నేరస్థులతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లైంగిక నేరాలు, దేశద్రోహం, రాజ్యద్రోహం, టెర్రరిజం కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఈ కాంట్రాక్ట్ కిందికి రారని తెలుస్తోంది. ఉక్రెయిన్ లో పోరాడేందుకు జైళ్లలో నుంచి ఖైదీలను రిక్రూట్ చేసుకోవడానికి రష్యా కిరాయి ఆర్మీ వాగ్నెర్ టీంకు గతంలో అనుమతి ఉంది, కానీ ఫిబ్రవరిలో ఇది ఆగిపోయింది. రక్షణమంత్రిత్వ శాఖ మరోసారి ఈ ప్రక్రియను చేపట్టిందని అక్కడి జైలు హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు.
