ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది… ఉక్రెయిన్ నుంచి రష్యాకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పడంలేదు.. రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్‌ను మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. సిటీ కోసం జరిగిన పోరులో తాము గెలిచినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ నుంచి శత్రు దేశ దళాలు వెనుదిరుగుతున్నట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై రష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డెర్‌గాచీ వద్ద దాడులు జరిగాయి. అక్కడ ఉన్న ఓ ఆయుధ డిపోపై రష్యా దళాలు దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
Read Also: Sri Lanka Economic Crisis: శ్రీలంక ప్రధాని కీలక నిర్ణయం
ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన రష్యాకు ఖార్కివ్ నగరాన్ని హస్తగతం చేసుకోవడమే ప్రధాన టార్గెట్. ఆరంభంలో ఆ నగరంపై భీకర దాడులు జరిగాయి. మరోవైపు, రష్యాతో జరుగుతున్న యుద్ధం ఈ ఏడాది చివరలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చెబుతోంది. ఆగస్టు మధ్యలో యుద్ధం కొత్త మలుపు తిరుగుతుందని, ఇక ఈ ఏడాది చివరి నాటికి యుద్ధం ముగుస్తుందని అంటున్నారు. ఏడాది చివరి నాటికి పట్టుకోల్పోయిన అన్ని ప్రాంతాల్లో మళ్లీ శక్తిని సాధిస్తామంటున్నారు. రష్యా ఓడిపోవడం వల్ల పుతిన్‌పై తిరుగుబాటు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మానసికంగా, శారీరకంగా పుతిన్ చాలా బలహీనమైన స్థాయిలో ఉన్నట్లు చెబుతోంది ఉక్రెయిన్ మిలటరీ.