Russia: రష్యా-ఉక్రెయిన్ యద్ధాన్ని విమర్శించి పాప్ స్టార్ డిమానోవా(35) ఓ నది ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆయన అసలు పేరు డిమిత్రి స్వర్గునోవ్. ఆయన ప్రముఖ సంస్థ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. డీమానోవా తన సోదరుడు ముగ్గరు స్నేహితులతో కలిసి మార్చి 19న గడ్డకట్టిన వోల్గా నది దాటుతుండగా మంచులో పడిపోయి మరణించారు. అతడి ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మూడో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.
Read Also: Building Collapsed : పండగ పూట విషాదం.. విశాఖలో కూలిన కుప్పకూలిన భవనం
తన పాటలతో డీమానోవా పుతిన్ ను తరుచు విమర్శించేవాడు. పుతిన్ ను విమర్శిస్తూ చేసిన ‘‘ఆక్వా డిస్కో’’ పాట రష్యాలో చాలా ఫేమస్ అయింది. ఉక్రెయిన్ పై రష్యా దాడికి వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ఈ పాట ప్రధాన పాత్ర పోషించింది. దీంట్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ 1.3 బిలియన్ డాలర్ల భవనాన్ని కలిగి ఉన్నట్లు విమర్శించారు. ఈ నిరసనలు ‘‘ఆక్వా డిస్కో పార్టీ’’గా పేరొందాయి.
యుద్ధంపై అధ్యక్షుడు పుతిన్ ను విమర్శిస్తు్న్న వారు వివిధ ప్రమాదాల్లో చనిపోతుండటం అనుమానాలకు తావిస్తోంది. తాజాగా డీమానోవా మరణించారు. క్రీమ్ సోడా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సోమవారం డీమానోవా మరణాన్ని ధ్రువీకరించింది. మా సోదరుడు డీమా, అతని సోదరుడు రోమా మరణించినట్లు వెల్లడించింది.