Ukraine Crisis: మూడో ప్రపంచ యుద్ధం ముప్పు.. ఉక్రెయిన్‌కు నాటో ఆయుధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది. అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో రష్యా సర్కారు మరింత భీకరంగా విరుచుకుపడుతోంది. నాటో దేశాలు తమను కవ్విస్తున్నాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోస్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మూడో ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాల ప్రయోగం తప్పదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
అటు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై తాము ఇప్పటికీ ఆశాభావంతో ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. టర్కీలో జరిగిన చర్చల్లోనే ఒక పరిష్కారం లభించాల్సిందని.. అయితే తాత్కాలిక ఒప్పందాలపై ఉక్రెయిన్ వెనక్కి తగ్గిందని ఆయన తెలిపారు. ఆ వైఖరి వల్లే తదుపరి ఒప్పందంలో ప్రతిష్టంభన నెలకొందని వివరించారు. మేరియుపోల్‌లోని ఉక్కు కర్మాగారం నుంచి పౌరుల తరలింపునకు తాము ముందుకొచ్చామని.. కానీ పౌరులను ఉక్రెయిన్ సైన్యం కవచాలుగా వాడుకుంటోందని పుతిన్ ఆరోపించారు.
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
అటు ఉక్రెయిన్ రక్షణ అవసరాలను తీర్చడానికి ఎలాంటి చర్య చేపట్టాలన్నా తాము సిద్ధంగానే ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. నాటో దేశాల అధికారులతో జర్మనీలోని అమెరికా సైనిక స్థావరంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆస్టిన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు సైనిక సాయం కొనసాగేలా చూడటంపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నారు. సార్వభౌమ, ప్రజాస్వామ్య దేశంగా ఉక్రెయిన్ ఉండాలనేది తమ ఆకాంక్ష అన్నారు. కాగా ఉక్రెయిన్‌కు విమాన విధ్వంసక స్వయంచాలిత జెపార్డ్ తుపాకులను అందజేయనున్నట్లు జర్మనీ ప్రకటించింది.
Ukraine Russia War: శాంతి చర్చల్లో కీలక పరిణామం.. రంగంలోకి ఐరాస..
తాజావార్తలు
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
-
Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్‌బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!