రష్యా, ఉక్రెయిన్ మధ్య యద్దం మొదలై మూడు నెలుల దాటింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. తాజాగా లక్సెంబర్గ్ చట్ట సభలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రసంగించారు. తన దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా నియంత్రిస్తోందని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాలో విలీనం అయిన క్రిమియా ద్వీపకల్పంతో పాటు రష్యాకు మద్దుతుగా నిలుస్తున్న వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న మొత్తం భూభాగం 20 శాతం ఉంటుందని ఆయన చెప్పకొచ్చారు.
రష్యా దళాలు తూర్పు ప్రాంతం డాన్ బోస్ లో తమ బలాన్ని పెంచుకున్నాయని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ వాస్తవ పరిపాలన కేంద్రం క్రమాటోర్స్క్ వైపు రష్యా బలగాలు కదులుతున్నాయని ఆయన అన్నారు. రష్యన్ ఆర్మీ కీవ్ రాజధాని ప్రాంతం, ఈశాన్య ప్రాంతం నుంచి వెనక్కి తగ్గి తూర్పు పారిశ్రామిక ప్రాంతంపై దాడులు చేస్తున్నాయని ఆయన అన్నారు.
2014 నుంచి రష్యా మద్దుతు వేర్పాటువాదులు, రష్యన్ మిలిటరీ ఉక్రెయిన్ లోని 43000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని నియంత్రిస్తున్నాయని.. ఇది నెదర్లాండ్స్ పరిమాణంలో ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ మూడు నెల్లో దాదాపుగా 1,25,000 చదరపు కిలోమీటర్లకు రష్యా ప్రాబల్యం పెరిగిందని ఆయన అన్నారు. ఇది మొత్తం నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్ భూభాాగాని కన్నా ఎక్కువ అని ఆయన అన్నారు.
దాదాపుగా 3,00,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కన్నా రెట్టింపు ఉక్రెయిన్ భూభాగం గన్స్, పేలని బాంబులతో నిండి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల 12 మిలియన్ల ఉక్రెయిన్లు వేరే చోటుకు తరలివెళ్లారని.. ఐదు మిలియన్ల మంది విదేశాలకు వెళ్లారని తెలిపారు.
