రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరోసారి తీవ్రంగా నడుస్తోంది. గత నాలుగేళ్ల నుంచి యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇరువైపులా ఆస్తులు ధ్వంసమయ్యాయి. తాజాగా మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సుమారు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
దాడుల నేపథ్యంలో కీవ్‌లో తీవ్ర ఆందోళన నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదుర్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేకపోయింది. అంతేకాకుండా ట్రంప్ బృందం కూడా ఇరువైపులా చర్చలు కూడా జరిపారు. అయినా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇలాంటి తరుణంలో మరోసారి భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.

