Site icon NTV Telugu

Crude oil: క్రూడాయిల్‌ మంటలు.. పదేళ్ల గరిష్టాన్ని తాకేసింది..

కరోనా మహమ్మారి ఎంట్రీ సమయంలో… లాక్‌డౌన్‌లు, కట్టడి చర్యల కారణంగా దారుణంగా పడిపోయిన కూడాయిల్‌ ధరలు.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం మరింత ఉధృతం అవుతోంది.. ఆ యుద్ధం ప్రభావం ఇప్పుడు ముడిచమురుపై పడుతోంది.. దీంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర ఏకంగా 117 డాలర్లకు చేరింది.. ఇది దశాబ్దంలో గరిష్ఠ స్థాయి కావడం ఆందోళన కలిగించే విషయం.. మరోవైపు.. రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచకూడదని నిర్ణయించాయి. ఇది కూడా ముడి చమురుపై తీవ్రంగా పడుతోంది.. ఈ పరిణామాల నేపథ్యంలో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 117 డాలర్లకు పెరగ్గా.. డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 2.67శాతం పెరిగి 113.6 డాలర్లకు చేరుకుంది.. బ్రెంట్‌ క్రూడ్‌ ధర గరిష్ఠంగా పెరగడం 2011 తర్వాత ఇదే తొలిసారి కావడం చర్చించుకోదగిన విషయం.

Read Also: Child Covid Vaccination: పిల్లలకు వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం

బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2014 తర్వాత తొలిసారిగా బ్యారెల్‌కు 100 డాలర్లు దాటేసింది.. గత 4 నెలలుగా క్రమంగా పెరుగుతూ పోతోంది.. బ్రెంట్‌ క్రూడ్‌ ధర డిసెంబర్‌లో 10.22శాతం, జనవరిలో ఏకంగా 17 శాతం, ఫిబ్రవరి నెలలో 10.7 శాతం, మార్చిలో అయితే ఇప్పటికే 16 శాతానికిపైగా పెరిగి అందరినీ భయపెడుతోంది.. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ముడిచమురు ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.. ఇవాళ ఏకంగా పదేళ్ల రికార్డును బద్దలు కొడుతూ గరిష్ఠ స్థాయికి చేరిన పిడుగులాంటి వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. వీటి ప్రభావం భారత్‌పై కూడా తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. భారత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.. ఇప్పటికే భారత్‌లో పెట్రోల్‌ ధరలు పెరగాల్సింది.. కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఆపినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7తో ముగియనుంది.. ఇక, 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.. మొత్తంగా 7వ తేదీ తర్వాత కానీ, 10 తర్వాత అయినా.. భారీగా పెట్రోల్‌ ధరలు పెరుగుతాయనే అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version