Site icon NTV Telugu

Zelensky: జూన్ చివరి నాటికి రష్యా 40వేల మంది సైనికులను కోల్పోవచ్చు

Zelenskey

Zelenskey

జూన్ చివరి నాటికి రష్యా 40వేల మందికి పైగా సైనికులను కోల్పోయే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ జెలెన్‌స్కీ అన్నారు. “రష్యన్ సైన్యం డాన్‌బాస్‌లో రిజర్వ్ దళాలను మోహరించడానికి ప్రయత్నిస్తోందని.. అయినా వారు ఏం సాధించారని” ఆదివారం ఆయన వ్యాఖ్యానించారు.
జూన్‌లో రష్యా 40వేలకు పైగా సైనికులను కోల్పోవచ్చని.. వారు అనేక దశాబ్దాలుగా చేసిన ఏ యుద్ధంలోనూ అంతమంది సైనికులను కోల్పోయి ఉండదని జెలెన్‌స్కీ వివరించారు. ఎనిమిదేండ్లుగా రష్యా అనుకూల రెబెల్స్ ఆధీనంలో ఉన్న డాన్‌బాస్​ ఏరియాలో పోరాటం దీటుగా కొనసాగుతోందని ఉక్రెయిన్ ప్రెసిడెంట్​ జెలెన్ స్కీ అన్నారు. ‘‘తూర్పు ఉక్రెయిన్​ను ఈజీగా స్వాధీనం చేసుకుంటామని రష్యన్లు అనుకున్నారు. కానీ డాన్బాస్ పోరాడుతోంది. 108 రోజులైనా రష్యాను ధిక్కరిస్తోంది” అని చెప్పారు.
రష్యా దాడుల ఫలితంగా ఆరేళ్ల చిన్నారి మృతి చెందిందని, రష్యా బలగాలు ఉక్రెయిన్ రక్షణ రేఖను ఫిరంగుల కాల్పులతో బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నాయని జెలెన్‌స్కీ వివరించారు.

Exit mobile version