Ukraine-Russia War: కొద్ది నెలలుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కారణంగా ఉక్రెయిన్ భారీగా నష్టపోయింది. ప్రాణ, భారీ ఆస్తి నష్టాన్ని చవిచూసింది. అయినప్పటికీ ఉక్రెయిన్ సైన్యం మాత్రం.. రష్యా దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు ఏడు నెలలు గడిచిపోతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచం మొత్తం ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ఈ యుద్ధంలో రష్యాకు ఉక్రెయిన్ సేనలు భారీ షాకిచ్చాయి. ఉక్రెయిన్‌లోని ఖార్ఖీవ్ ప్రావిన్స్‌లో కీలక నగరమైన ఇజియంను రష్యా నుంచి ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది.
ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా రష్యా సైన్యం తమ ఆధీపత్యం చేలాయిస్తూ ఆధీనంలోకి తీసుకున్నాయి. తాజాగా రష్యాకు షాకిస్తూ ఉక్రెయిన్ తమ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ ప్రాంతం ఉక్రెయిన్ ఆధీనంలోకి వెళ్లడం ఆ దేశానికి కీలక పరిణామంగా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఉక్రెయిన్‌పై దాడుల విషయంలో వ్లాదిమిర్ పుతిన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ లక్ష్యం నెరవేరేంత వరకు ఉక్రెయిన్‌పై తమ సైన్యం దాడి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
తాజాగా తమ సైన్యం విజయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ స్పందించారు. ఉక్రెయిన్‌లో ఆక్రమణదారులకు చోటులేదని ఆయన అన్నారు. రష్యా దాడులను ఉక్రెయిన్ సైన్యం ధైర్యంగా ఎదుర్కొందని ఆయన అభినందించారు. ఉక్రెయిన్ సైన్యం దేశంలోని మరికొన్ని భాగాలను విముక్తి చేసుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు. విజయం అనంతరం ఉక్రెయిన్ సైన్యం తమ దేశ జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకుంది. ఇది రష్యాకు ఎదురు దెబ్బేనని నిపుణులు అంటున్నారు.
