NTV Telugu Site icon

Russia Ukraine War: యుద్ధానికి 3 ఏళ్లు.. 267 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి..

Russia Ukraine War

Russia Ukraine War

Russia Ukraine War: ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచాయి. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన యుద్ధంలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు. అయితే, యుద్ధంలో రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ మాత్రం సర్వనాశనం అయింది. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమై మూడేళ్లు గడిచిన సందర్భంగా రష్యా, ఉక్రెయిన్‌పై డ్రోన్లతో విరుచుకుపడింది.

Read Also: Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..

ఉక్రెయిన్ అధికారుల ప్రకారం.. ఖార్కివ్, పోల్టావా, సుమీ, కీవ్, చెర్నిహిల్, మైకోలైవ్, ఒడెసాతో సహా మొత్తం 13 ప్రాంతాల్లో డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిని అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా సమన్వయంతో ఒకేసారి రికార్డ్ స్థాయిలో 267 డ్రోన్లనున ప్రయోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళ కమాండ్ ప్రతినిధి యూరి ఇగ్నాట్ తెలిపారు. వీటిలో 138 మందిని అడ్డగించగా, 119 డ్రోన్లు జామ్ అవ్వడంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. రష్యా మూడు బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించిందని వెల్లడించారు. ఉక్రెయిన్ లోని 5 ప్రాంతాల్లో నష్టం వాటిల్లినట్లు తెలిపారు.

రష్యా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యుద్ధంలో అతిపెద్ద దాడి అని అన్నారు. గత వారం రష్యా ఉక్రెయిన్‌పై దాదాపు 1150 అటాక్ డ్రోన్లు, 1400 కంటే ఎక్కువ గైడెడ్ ఏరియల్ బాంబులు, వివిధ రకాల 35 క్షిపణుల్ని ప్రయోగించిందని జెలెన్స్కీ చెప్పారు.