Site icon NTV Telugu

Russia: రష్యా గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి

Russia

Russia

రష్యాలో భారీ విస్ఫోటనం జరిగింది. డాగేస్తాన్ గ్యాస్ స్టేషన్‌‌లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు. ఇక అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ప్రాంతీయ రాజధాని మఖచ్కల తూర్పు శివార్లలోని ఖానావ్యూర్ట్ జిల్లాలోని సులేవ్‌కెంట్ గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగింది.

ఇది కూడా చదవండి: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సర్వే.. ప్రజలు షాకింగ్ రెస్పాన్స్

ప్రమాదం జరగగానే స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పేలుడు ధాటికి గ్యాస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసమైంది. ఇక పేలుడు తర్వాత నల్లటి పొగ గాల్లో కమ్ముకుంది. పేలుడు సంభవించినప్పుడు చెవులు చిల్లులు పడేలా శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇంధనం నింపే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది. పేలుడు కారణంగా సర్వీస్ స్టేషన్, ప్రక్కనే ఉన్న కేఫ్టీరియాలతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అత్యవసర సేవలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

 

Exit mobile version