Site icon NTV Telugu

Ukraine Russia War: రష్యా బలగాల కీచక పర్వం.. వెలుగులోకి దారుణాలు..

Ukraine Russia War

Ukraine Russia War

అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు ఎదురైనా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది.. ఇరు దేశాల మధ్య యుద్ధం 48వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై ఇంకా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా తన దాడులను కీవ్‌ నుంచి తూర్పు ఉక్రెయిన్‌ వైపు కేంద్రీకృతం చేసింది. పోర్టు సిటీ మరియుపోల్ పై నియంత్రణ సాధించే లక్ష్యంతో రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నాయి. కాగా వారిని అడ్డుకునేందుకు, తమ భూభాగాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ డిఫెండింగ్ దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కాగా రష్యా దళాలు మరింత చేరువవుతున్నాయి. దాంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తమ నగరాన్ని రక్షించుకునేందుకు మరిన్ని ఆయుధాలు సమకూర్చాలని మిత్ర దేశాలను కోరారు.

Read Also: Ukraine Russia War: రష్యాకు షాక్‌ ఇచ్చిన మరో కీలక సంస్థ..!

రష్యా బలగాల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. పక్కగదిలో బిడ్డ ఏడుస్తున్నా, తల్లిపై సామూహిక అత్యాచారం.. పదేళ్ల చిన్నారులనూ వదలని క్రూరత్వం.. అందుకే వారి నుంచి తప్పించుకునేందుకు జుట్టు కత్తిరించుకుంటున్న ఆడపిల్లలు.. ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతోన్న మారణహోమంలో ఇలా ఎన్నో అమానవీయ ఘటనలు బయటకువచ్చాయి. ఐరాస భద్రతా మండలికి వచ్చిన ఫిర్యాదులతో.. పుతిన్‌ సేనల దారుణాలు తెలిసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. వీటిని అంతర్జాతీయ సమాజంతో పాటు, ఉక్రెయిన్ మానవహక్కుల సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక, ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు నరమేధానికి, అకృత్యాలకు పాల్పడ్డాయన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పందించారు. రష్యా, బెలారస్‌ల ఆంక్షలతో మరింత ఇరకాటం పెట్టే ప్రయత్నాలు చేశారని ఆయనన్నారు. ఇరుదేశాల సమగ్రతను పెంచడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఇక బుచా మారణహోమాన్ని.. ఫేక్‌గా అభివర్ణించారు పుతిన్‌. డిమాండ్‌ల విషయంలో ఉక్రెయిన్‌ అస్థిరత్వం వల్లే శాంతి చర్చల పురోగతి మందగిస్తుందని మండిపడ్డారు. ఉక్రెయిన్ తూర్పు దాడికి కట్టుబడి ఉన్నందున మాస్కో తన సైనిక దూకుడును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు పుతిన్‌. ఫిబ్రవరి 24 నుంచి రష్యా యుద్ధం మొదలు.. ఇప్పటివరకు 44 మిలియన్ల మంది ఉక్రెయిన్‌ను విడిచి వలసలు వీడారు. రష్యా వరుస బాంబు దాడులు, షెల్లింగ్‌తో నగరాలు దిబ్బలుగా శిథిలమై మిగిలాయి. వేల మంది మృత్యువాత పడగా.. అందులో సాధారణ పౌరులే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటివరకు 19వేల 600 మంది రష్యా సైనికులు హతమైనట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ ప్రకటించింది.

Exit mobile version