Putin: ప్రపంచ దేశాలతో రష్యాను వేరు చేయడం అసాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, చైనాతోనే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ సన్నిహత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలతో రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధం వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుందని… అక్కడ 150 కోట్ల మంది ఉన్నారన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యమని పుతిన్ వెల్లడించారు. . మా సార్వభౌమత్వాన్ని, భూభాగాలను తిరిగి తెచ్చుకోవడంతోపాటు బలోపేతం చేసుకొనే కార్యక్రమం చేపట్టామని… ఆ లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తామంటూ యువ పారిశ్రామికవేత్తలతో వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నట్లు రష్యా అధికారిక మీడియా వెల్లడించింది.
ఇక రష్యా నుంచి ఇంధన సరఫరాను నిలిపివేసి ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని ఐరోపా దేశాలు పిలుపునివ్వడంపై పుతిన్ స్పందించారు. రానున్న కొన్ని సంవత్సరాల్లో రష్యా ఇంధన వనరులను వదులుకోవడం ప్రతి ఒక్కరికీ అసాధ్యమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు.సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న మొదలుపెట్టిన రష్యా దురాక్రమణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా దూకుడును అడ్డుకునేందుకు పశ్చిమదేశాలు ఆంక్షలు విధిస్తూనే ఉన్నాయి. రష్యా తీరును నిరసిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలు కూడా అక్కడ తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?