Site icon NTV Telugu

తాలిబ‌న్ నేత‌ల‌తో ర‌ష్యా రాయ‌బారి స‌మావేశం…

ఆఫ్ఘ‌నిస్తాన్ తాలిబ‌న్ల వ‌శం అయ్యాక ఆక్క‌డ ప‌రిస్థితుల‌ను ర‌ష్యా ప్ర‌భుత్వం నిశితంగా గ‌మ‌నిస్తోంది.  2001 కి ముందు కూడా తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ప‌రిపాలించారు.  అయితే, వారి అరాచ‌క పాల‌న ఎంతో కాలం సాగ‌లేదు.  2001లో ఉగ్ర‌వాదులు అమెరికా వ‌ర‌ల్డ్ ట్రేడ్ ట‌వ‌ర్స్‌పై దాడులు చేసి కూల్చివేసిన త‌రువాత అమెరికా సైన్యం ఆఫ్ఘ‌న్ లోకి అడుగుపెట్టి తాలిబ‌న్ల‌ను త‌రిమికొట్టింది.  అంత‌కు ముందు అంటే, 1979 ప్రాంతంలో అఫ్ఘ‌న్‌కు ర‌ష్యా స‌హ‌కారం అందించింది.  ఆప్రాంతాన్ని సోవియ‌ట్ యూనియ‌న్ త‌మ ఆధీనంలోకి తీసుకున్న కొన్నాళ్ల‌కు సోవియ‌ట్ యూనియ‌న్ ప‌త‌నం త‌రువాత ర‌ష్యా ద‌ళాలు వెన‌క్కి తిరిగాయి.  కాగా, ఇప్పుడు మ‌రోసారి ర‌ష్యా ఆఫ్ఘ‌న్‌కు స‌హ‌కారం అందించేందుకు ముందుకు వ‌స్తున్న‌ట్టు స‌మాచారం.  తాలిబ‌న్ నేత‌ల‌తో ఈరోజు ర‌ష్యా రాయ‌బారి ప్రత్యేకంగా స‌మావేశం కాబోతున్నారు.  కొత్త‌గా ఏర్పాటు కాబోయే ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటామ‌ని చెప్పెందుకు ఆయ‌న స‌మావేశం కాబోతున్నార‌ని స‌మాచారం.  ఈ చ‌ర్చ‌లు ఫ‌లిస్తే మ‌రోసారి ర‌ష్యాసేన‌లు ఆఫ్ఘ‌నిస్తాన్‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంటుంది.  అటు చైనా కూడా తాలిబ‌న్ ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తామ‌ని చెప్ప‌న విష‌యం తెలిసిందే.  

Read: ఆగ‌స్టు 17, మంగ‌ళ‌వారం దిన‌ఫ‌లాలు…

Exit mobile version