Russia accuses US of plot to eliminate Vladimir Putin to end Ukraine war: ఉక్రెయిన్-రష్యా యుద్ధం పదో నెలకు చేరుకుంది. అయినా ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడప్పుడే శాంతి నెలకొనే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ మరింతగా ఆయుధ సహాయం, ఆర్థిక సహాయాన్ని పొందేందుకు అమెరికాలో పర్యటించారు. అమెరికా నుంచి పెట్రియాడ్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కోరుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం అంటూ రష్యా ఆగ్రహం వ్యక్త చేస్తోంది. రష్యాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది.
Read Also: Fight on flight: ఎయిర్‌బస్‌ను ఎర్ర బస్సు చేశారు కదరా.. ఫ్లైట్‌లో చితక్కొట్టుకున్న ప్రయాణికులు
ఇదిలా ఉంటే రష్యా మరోసారి అమెరికాపై సంచలన ఆరోపణలు చేసింది. ఉక్రెయిన్ యుద్దాన్ని ముగించడానికి పుతిన్ ను చంపేందుకు ప్లాన్ చేస్తోందని ఆరోపించింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. పుతిన్ ను నిర్మూలించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధాలని ముగించాలని అమెరికా చూస్తుందని అన్నారు. రష్యాపై పశ్చిమ దేశాల విధానం అత్యంత ప్రమాదకరమైనదని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే రష్యా శాంతి చర్చలకు ప్రాధాన్యత ఇస్తున్నా.. ఉక్రెయిన్ మాత్రం పట్టించుకోవడం లేదని రష్యా ఆరోపిస్తోంది. గతంలో పుతిన్ అధికారంలో ఉన్నంత వరకు రష్యాతో చర్చలు అనేవే ఉండవని ప్రకటించాడు. జెలన్స్కీ తన 10 పాయింట్ల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడితో చర్చించాడు. అయితే జెలన్స్కీ చెబుతున్నట్లు శాంతి ప్రణాళికలకు అంగీకరిస్తే ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలు లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరొజ్జియా, ఖేర్సన్ ప్రాంతాలను రష్యా వదులుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు రష్యా 2014లో ఆక్రమించుకున్న క్రిమాయను కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయితే దీనిపై రష్యా స్పోక్స్ పర్సన్ దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న రియాలిటీని పరిగణలోకి తీసుకోనంత వరకు ఉక్రెయిన్ శాంతి చర్చల్లో పురోగతి ఉండదని అన్నారు.