Donald Trump: అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలపై నిప్పులు కురిపించారు. యూరప్ దేశాలను తీవ్రంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంపై గ్రీన్‌ల్యాండ్ యూఎస్‌కు అవసరం అంటూనే, యూరప్ సరైన దిశలో ప్రయాణించడం లేదని విమర్శించారు. అమెరికా భూమి పైన ఆర్థిక ఇంజన్‌గా పని చేస్తోందని, మరోవైపు యూరప్ గుర్తింపు లేనిదిగా మారిందని ఆయన విమర్శించారు. యూరప్‌లోకి అక్రమ వలసలు పెరిగాయని, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సరిగా లేదని ఆయన చెప్పారు.
Read Also: Off The Record: రసవత్తరంగా మారుతున్న చేవెళ్ళ కాంగ్రెస్ రాజకీయం
తాను యూరప్‌ను ప్రేమిస్తున్నానని, యూరప్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నానని, కానీ సరైన దిశలో వెళ్లడం లేదని ఆయన అన్నారు. అమెరికా యూరప్ ప్రజల కోసం శ్రద్ధ వహిస్తుందని, తన పూర్వీకులకు ఈ ఖండంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. యూరప్ తనను తాను నాశనం చేసుకుంటోందని, వాషింగ్టన్ దానిని బలంగా చూడాలనుకుంటున్నా, బలహీనంగా మారుతోందని అన్నారు.
మరోవైపు, గ్రీన్‌ల్యాండ్ తప్పకుండా అమెరికాకు అవసరమని చెప్పారు. దీనిని వద్దు అనే వారిని తాము గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. డెన్మార్క్ గ్రీన్‌ల్యాండ్‌ను రక్షించలేదని చెప్పారు. ఆ ప్రాంత రక్షణ యూఎస్‌తోనే సాధ్యమని అన్నారు. ఇది అమెరికా జాతీయ, అంతర్జాతీయ భద్రతకు చాలా కీలకమని చెప్పారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికా తీసుకోవడం, అమెరికా-యూరప్‌లకు రెండింటికి ప్రయోజనం అని ఆయన అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌పై యూఎస్ నియంత్రణ, నాటోను కూడా బలపరుస్తుందని అన్నారు.
