Site icon NTV Telugu

Trump: ట్రంప్‌కు సీరియస్!.. జోరుగా ప్రచారం

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన సడన్‌గా అదృశ్యమయ్యారు. దీంతో ఆయనకు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఇటీవల ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. అవసరమైతే అధ్యక్ష పదవిని చేపడతానని ప్రకటించారు. అలాగే ట్రంప్ షెడ్యూల్ కార్యక్రమాలు కూడా ఇప్పటి వరకు వైట్‌హౌస్ ప్రకటించలేదు. దీంతో ట్రంప్‌కు ఏదో జరిగిందంటూ అంతర్జాతీయంగా వార్త కోడైకూస్తోంది.

ఇది కూడా చదవండి: Hamas-Israel: అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి వీడియోను విడుదల చేసిన నెతన్యాహు.. ఎందుకోసమంటే..!

అయితే తాజాగా సోషల్ మీడియాలో ట్రంప్‌కు సీరియస్‌గా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా కూడా ఈ వార్త హైలెట్ అవుతోంది. ఇంత జోరుగా ప్రచారం సాగుతున్నా.. ఇప్పటివరకు ఈ వార్తలను వైట్‌హౌస్ ఖండించకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Delhi Horror: ప్రసాదంపై వివాదం.. ఆలయ సేవకుడు హత్య

ప్రస్తుతం ట్రంప్‌కు 79 ఏళ్లు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ట్రంప్‌ చేతిపై గాయం కూడా కనిపించింది. ఈ గాయాన్ని దాచడానికి పలుమార్లు చేతికి మేకప్‌ వేసుకొని కనిపించారు. అయితే ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వ్యక్తిగత వైద్యులు అంటున్నారు. దీనిపై వైట్‌హౌసే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Exit mobile version