NTV Telugu Site icon

UK: బ్రిటన్ పార్లమెంట్‌లో మోదీ డాక్యుమెంటరీపై రచ్చ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ సిరీస్..

Rishi Sunak, Narendra Modi

Rishi Sunak, Narendra Modi

BBC documentary on Prime Minister Modi: గుజరాత్ 2002 అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రూపొందించిన ‘‘ ఇండియా: మోదీ క్వశ్చన్’’ డ్యాకుమెంటరీ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీపై భారత ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. బీబీసీ వలసవాద మనస్తత్వంతో, ప్రచారంలో భాగంగా ఇదంతా చేస్తోందని భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2002 గుజరాత్ అల్లర్లలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన సంగతిని ప్రస్తావిస్తున్నారు బీజేపీ నేతలు.

Read Also: Mahmood Ali : పలువురు చనిపోయినట్టు అనుమానం.. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతాం

ఇదిలా ఉంటే ఈ డాక్యుమెంటరీ బ్రిటన్ పార్లమెంట్ ను కూడా కుదిపేసింది. పాక్ సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ ఈ డ్యాక్యుమెంటరీపై చర్చను లేవనెత్తారు. ప్రధాని మోదీ ఈ హింసకు ప్రత్యక్ష బాధ్యత వహించాడని.. వందలాది మందిని చంపారని, యూకే, ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని, మోదీ నేరుగా బాధ్యత వహించాలని విదేశాంగ కార్యాలయం దౌత్యవేత్తలతో ప్రధాని రిషి సునాక్ అంగీకరిస్తారా..? అని ప్రశ్నిస్తూ, మోదీపై విమర్శలు గుప్పించాడు.

అయితే దీనికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. దీనిపై యూకే ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని ఇది మారలేదని, మేం ఎక్కడా హింస జరిగినా సహించమని ఆయన అన్నారు. వ్యక్తిత్వాన్ని కించపరచడం సరికాదని ఎంపీ ఇమ్రాన్ హుస్సెన్ కు సమాధానం ఇచ్చాడు.

గుజరాత్ అల్లర్ల సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. అయితే 2002 మతకలహాలపై బ్రిటిష్ ప్రభుత్వ విచారణ బృందం ఓ రిపోర్టును గతంలో వెలువరించింది. దీనిని ఆధారంగా చేసుకుని బీబీసీ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. నరేంద్రమోదీనే ఈ అల్లర్లకు బాధ్యుడని.. ఊచకోతకు, అల్లర్లకు పాల్పడిన హిందుత్వ శక్తులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని.. ఎలాంటి అల్లర్లు చేసిన పోలీసులు అడ్డుకోలేదని బ్రిటిష్ ప్రభుత్వ విచారణ బృందం రిపోర్టు ఇచ్చింది. అయితే ఈ ఘటనపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్లు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని బీబీసీ పట్టించుకోలేదు.