Site icon NTV Telugu

Parle-G Biscuits: రూ.5 పార్లే-జీ బిస్కెట్.. గాజాలో ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

Parle G Biscuits

Parle G Biscuits

ఇజ్రాయెల్-గాజా మధ్య గత రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకారంగా గాజాపై దాడి చేస్తూనే ఉంది. హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది చనిపోగా.. ఇంకొందరు తిండి లేక ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా కొన్ని నెలలుగా గాజా సరిహద్దులు మూసేయడంతో నిత్యావసర వస్తువులు లోపలికి వెళ్లడం లేదు. దీంతో కరవు తీవ్ర స్థాయికి చేరింది. ఇక ఎక్కడైనా కిరాణా సామాగ్రి దొరికితే ధరలు ఆకాశాన్నంటాయి. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పార్లే-జీ బిస్కెట్లు కూడా కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయి.

ఇది కూడా చదవండి: AP Government: ఏపీ సర్కార్‌ కసరత్తు.. ఇక, రేషన్‌ బదులు నగదు..!

గాజాలో ప్రస్తుతం రూ.5 ఇండియన్ బిస్కెట్ రూ.2,400కి అమ్ముడవుతోంది. అంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ బిస్కెట్లు దాదాపు 4,300 కి.మీ దూరంలో ఉన్న దేశం నుంచి ఎగుమతి అవుతుంది. భారతీయ గృహాల్లో ప్రధానంగా పిల్లలు టీ బ్రేకుల సమయంలో ఉపయోగిస్తుంటారు. పోషకాహారం ముడిపడి ఉండడంతో ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ధర తక్కువే కానీ.. గాజాలో కరవు కారణంగా 500 రెట్లు ఎక్కువగా అమ్ముడుపోతుంది.

ఇది కూడా చదవండి: PM Modi: చినాబ్ బ్రిడ్జి.. ఐక్యత.. సంకల్పానికి చిహ్నం

ఇటీవల గాజా నుంచి ఒక పోస్ట్ వైరల్ అయింది. పార్లే జీ బిస్కెట్లు 24 యూరోలకు (రూ.2,342) అమ్ముడుపోతున్నాయని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘చాలాసేపు వేచి ఉన్న తర్వాత నేను చివరకు ఈరోజు రవీఫ్‌కి ఇష్టమైన బిస్కెట్లు కొన్నాను. ధర 1.5 యూరోల నుంచి 24 యూరోలకు పెరిగినప్పటికీ.. రఫీఫ్‌కు ఇష్టమైన ట్రీట్‌ను నేను కాదనలేకపోయాను.’’ అని పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన భారతీయులు.. ఇండియాలో ఇంత చౌకైన బిస్కెట్లు.. గాజాలో అంత ధర పలకడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

పార్లే జీ బిస్కెట్ ఒక్కటే కాదు. అన్ని నిత్యావసర ధరలన్నీ ఇదే మాదిరిగా ఉన్నాయి. జూన్ 6, 2025 నాటికి ఉత్తర గాజా నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన ధరలు ఇలా ఉన్నాయి.

కిలో చక్కెర: రూ. 4,914
లీటరు వంట నూనె: రూ. 4,177
కిలో బంగాళాదుంపలు: రూ. 1,965
కిలో ఉల్లిపాయలు: రూ. 4,423
కాఫీ కప్పు: రూ. 1,800

 

Exit mobile version