Marble Palace: అందమైన కట్టడాలను చూడాలనుకుంటే దుబాయ్ వెళ్లాలి. అక్కడ ఇంద్రభవనాలను తలపించే ఎన్నో అద్భుత కట్టడాలు నగరంలో దర్శనిమిస్తుంటాయి. అలాంటి అద్భుతమైన భవనాలు ఉన్న దుబాయ్ నగరంలో ఇప్పుడు మార్బు్‌ల్ ప్యాలెస్ అమ్మకానికి.. అదేవిధంగా అద్దెకు సైతం అందుబాయిలో పెట్టారు. ఇంద్రభవనం లాంటి మహా అద్భుతమైన భవంతి. అదే మార్బుల్ ప్యాలెస్. అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించడం వల్లే దీనికి ఈ పేరు వచ్చిందట. దీని ఖరీదు వింటే టెన్షన్ పడక తప్పదు..
Read also: India’s Forex Reserves: మళ్లీ తగ్గిన భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు
మార్బుల్ ప్యాలెస్ ఖరీదు వందల కోట్లలోనే ఉంది. మార్కెట్‌లో ప్రస్తుతం దీని ధర 750 మిలియన్ దిర్హమ్స్… అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.1,600 కోట్లు అన్నమాట. కాస్ట్ కొంచెం ఎక్కువైన కూడా భవంతిని చూసిన తరువాత రేటు ఎక్కువ కాదని భావిస్తారు. మనసు దోచేలాగా భవంతిని నిర్మాణం చేశారు. అంత అందమైన భవంతి అమ్మకానికి ఉందని తెలియడంతో కొంతమంది మిలియనీర్లు కొనుగోలు కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఇంద్రభవనం లాంటి మార్చుల్ ప్యాలెస్‌న కొనడానికి మోజుపడుతున్నవారిలో ఓ భారతీయుడు కూడా ఉండడం విశేషం. లక్షాబిటాట్ సోత్ బేస్ ఇంటర్నేషనల్ రియాల్టీ (Luxhabitat Sotheby’s International Realty) వారు విక్రయానికి ఉంచిన ఈ భవంతి నిర్మాణానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. 2018లో దీని నిర్మాణ పనులు పూర్తి అయినట్టు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Read also: Hyderabad: హైదరాబాద్ లో అమ్ముడు పోని ఇళ్లు.. కారణం ఏంటో తెలుసా..?
ఇంద్ర భవంతి విశేషాలు ఏమిటంటే… 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో సువిశాలంగా భవంతిని నిర్మించారు. ఇంట్లో మొత్తం ఐదు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ ఒక్కటే 4వేల చదరపు అడుగులు ఉంటుంది. అంటే ఒక పెద్ద భవంతిని మించిన విస్తీర్ణం అన్నమాట. అలాగే 15 కార్ల గ్యారేజ్, ఇండోర్, అవుట్‌డోర్ స్మిమ్మింగ్ పూల్స్, 19 రెస్ట్‌రూమ్‌లు, 2 రూఫ్‌లు ఉంటాయి. ఇంకా 80వేల లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు. ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లతో ఇంకా ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఈ భవనం సొంతం చేసుకుంది. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది.ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కోవచ్చు లేదంటే అద్దెకు తీసుకోవచ్చు, లేదా టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అని కునాల్ సింగ్ తెలిపారు. ఆయన చెబుతున్న వివరాల ప్రకారం ప్రపంచంలో దీనిని కేవలం 5 నుండి 10 మంది సంపన్నులు మాత్రమే కొనుగోలు చేయగలరని అభిప్రాయ పడ్డారు.అంతేకాకుండా గత 3 వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూడడం జరిగిందట.ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే 3 నివాసాలను కలిగి ఉన్న భారతీయుడు ఉన్నారని చెప్పారు.