NTV Telugu Site icon

Leeds Riots: బ్రిటన్‌లోని లీడ్స్‌లో అల్లర్లు.. పోలీసు వాహనాల ధ్వంసం..!

Uk

Uk

Leeds Riots: బ్రిటన్ దేశంలోని లీడ్స్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. గత రాత్రి లీడ్స్ నగరంలో దుండగులు బీభత్సం సృష్టించారు. పెద్ద సంఖ్యలో గుమిగూడి పలు వాహనాలు, బస్సులకు నిప్పు పెట్టారు. కొంత మంది మాస్కులు ధరించి హెయిర్‌హిల్స్ ప్రాంతంలో అల్లర్ల సృష్టించారు. ఈ అల్లరిమూకలు పోలీసు వాహనాలపై కూడా దాడి చేశారు. అయితే, ఈ అల్లర్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Read Also: Indo-Pak War Time: ఇండో-పాక్ యుద్ధ కాలం నాటి 27 మోర్టార్ షెల్స్ లభ్యం..

ఇక, పిల్లల సంరక్షణ ఏజెన్సీ స్థానిక పిల్లలను తీసుకెళ్లడం వల్ల అల్లర్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగా ఉన్న పిల్లలను తీసుకెళ్లకుండా ప్రజలు నిరసన తెలిపారు. దీంతో లక్సర్ రోడ్‌లో గందరగోళం నెలకొంది. ఇవాళ ఉదయం హేర్‌హిల్స్ యుద్ధభూమిలా కనిపించింది అని స్థానికులు వెల్లడించారు. అల్లర్ల గుంపు ఆ ప్రాంతమంతటా అనేక చోట్ల హింసకు పాల్పడుతూ.. పలు వెహికిల్స్ ను కాల్చి వేసినట్లు పేర్కొన్నారు. ఈ హింసాత్మక ఘటనతో రంగంలోకి దిగిన పోలీసుల అల్లరిమూకలను తరిమికొట్టారు. ఈ సంఘటనపై లీడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకు.. ఈ గొడవకు కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Show comments