NTV Telugu Site icon

Remi Lucidi: విషాదాంతంగా ముగిసిన సాహస యాత్రికుడి ప్రయాణం.. 68వ అంతస్తు నుంచి పడి..

Remi Lucidi Died

Remi Lucidi Died

Remi Lucidi Known For Extreme Sports Dies After Falling Off From Building In Hong Kong: అత్యంత ఎత్తైన భవనాలను అధిరోమిస్తూ ‘డేర్ డెవిల్’గా పేరొందిన రెమీ లుసిడి.. ప్రమాదవశాత్తు ఒక భవనంపై నుంచి కిందకు జారిపడి మృతి చెందాడు. ప్రమాదాలతో చెలగాటమాడే ఈ 30 ఏళ్ల లుసిడి.. తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని ప్రయత్నించి కిందకు జారిపడ్డాడు. అతను కింద పడిపోవడానికి ముందు.. 68వ ఫ్లోర్‌లోని పెంట్‌హౌస్‌ కిటికీ బయట చిక్కుకుపోయాడు. దాన్ని బలంగా తన్నడంతో, అతని కాలు పట్టుతప్పింది. దీంతో నేరుగా కిందపడి, సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

Cessna 177: సముద్రంలో ల్యాండ్ అయిన విమానం.. కారణమిదే.. చివరికి ఏమైంది?

హాంకాంగ్‌ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. లుసిడి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌కు చేరుకొని, 40వ అంతస్తులో తన స్నేహితుడ్ని కలవడానికి వెళ్తున్నానని సెక్యూరిటీ గార్డుకి చెప్పి, లోపలికి వెళ్లాడు. ఎంతకైనా మంచిది, ఒకసారి నిర్ధారించుకుందామని.. 40వ అంతస్తులో ఉండే వ్యక్తికి సెక్యూరిటీ గార్డు ఫోన్ చేశాడు. అయితే.. ఆ వ్యక్తి తనకు లుసిడి ఎవరో తెలియదని సెక్యూరిటీ గార్డుకి సమాధానం ఇచ్చాడు. అప్పటికే లుసిడి చాకచక్యంగా సెక్యూరిటీ కళ్లు గప్పి.. లోపలికి వెళ్లి, ఎలివేటర్‌లో దూరాడు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. 49వ అంతస్తులు మెట్లు ఎక్కుతూ లుసిడి కనిపించాడు. ఉదయం 7:38 సమయంలో.. లుసిడి పెంట్‌హౌస్ బయట కిటికీ తడుతూ.. ఒక పని మనిషికి కనిపించాడు. అతడ్ని చూసి ఖంగుతిన్న ఆమె.. పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్

మరోవైపు.. లుసిడి కాలు ఆ పెంట్‌హౌస్ కిటికీలో ఇరుక్కుంది. దాన్నుంచి బయటపడేందుకు అతడు బలంగా కాలితో కిటికీని తన్నాడు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ తప్పి.. అతడు కిందకు పడ్డాడు. 68వ అంతస్తు నుంచి కిందపడటంతో.. అతడు స్పాట్‌లోనే చనిపోయాడు. ఘటనా స్థలంలో లుసిడి కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లుసిడి మరణవార్త విని.. అతని అభిమానులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు.