Crocodiles attack: ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. కాలక్షేపం కోసం చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసళ్లు దాడి చేశాయి. మొసళ్లు చంపి తిన్నాయి. ఈ ఘటన ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. 65 ఏళ్ల బాధితుడిని కేవిన్ దర్మోడీ అని గుర్తించారు. శనివారం రినియిర్రు (లేక్‌ఫీల్డ్) నేషనల్ పార్క్‌లోని కెన్నెడీ బెండ్ వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన అతను మొసళ్ల దాడిలో చిక్కుకున్నాడు. అక్కడే సమీపంలో ఉన్న మరికొంత మంది చేపలు పట్టే వ్యక్తులు కెవిన్ అరుపులు విన్నారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లి చూసే సరికి పెద్ద ఎత్తున నీటిలో అలజడి కనిపించినట్లు తెలిపారని కైర్న్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మార్క్ హెండర్సన్ చెప్పారు.
Read Also: Jeans : మా తల్లే.. ఉతికితే చిరిగిపోద్దని 18ఏళ్లు ఒకటే జీన్స్ వేసుకున్నావా
తరువాత సంఘటన స్థలానికి చేరుకున్న రేంజర్లు రెండు మొసళ్లను కాల్చి చంపేశారు. మొసళ్లలో ఒకటి 14 అడుగులు, మరొకటి 9 అడుగులు ఉంది. పరీక్షిస్తే ఈ రెండు మొసళ్లలో మానవ అవశేషాలు కనిపించాయని పోలీసులు వెల్లడించారు. పోలీస్ అధికారి హెండర్సన్ దీన్ని విషాదకరమైన సంఘటనగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా మొసళ్లు ఎక్కువగా ఉండే దేశం అని, ముఖ్యంగా మీరు మొసళ్ల సంరక్షణ ప్రాంతాల్లో ఉండే చెరువుల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలని, అందులో మొసళ్లు ఉండే అవకాశాలు ఎక్కువని వన్యప్రాణి అధికారి మైఖైల్ జాయిస్ వెల్లడించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.