NTV Telugu Site icon

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట.. ఓ కేసులో నిర్దోషిగా ప్రకటన

Imrankhan

Imrankhan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన సన్నిహితులకు ఇస్లామాబాద్ కోర్టులో ఉపశమనం లభించింది. సెక్షన్ 144 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో బుధవారం మాజీ ప్రధాని, అతని సన్నిహితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇమ్నాన్ ఖాన్, షేక్ రషీద్, అసద్ ఖైజర్, సైఫుల్లా నియాజీ, సదాకత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు అభియోగాలను కొట్టివేసింది.

ఇది కూడా చదవండి: Tharun Bhascker : తరుణ్ భాస్కర్‌కి షాక్ ఇచ్చిన అభిమాని

పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ- ఇన్సాఫ్‌ పార్టీ నేతృత్వంలో చేపట్టిన నిరసనలు కారణంగా పబ్లిక్‌ ఆర్డర్‌ను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఇస్లామాబాద్‌లోని అబ్బారా పోలీస్‌ స్టేషన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ సహా పలువురు నేతలపై 2022 ఆగస్టు 20న కేసు నమోదైంది. పోలీసులు మోపిన అభియోగాలను జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ యాసిర్‌ మహమూద్‌ కొట్టివేశారు. 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వం రద్దయినప్పటి నుంచి ఆయనపై డజన్ల కొద్దీ కేసులు నమోదవ్వడంతో ఆయన ప్రస్తుతం జైలులోనే ఉన్నారు.

ఇది కూడా చదవండి: Maharashtra Polls: సీఎం ఏక్‌నాథ్‌షిండే, అజిత్ పవార్ బ్యాగ్‌లు తనిఖీ.. సహకరించిన అగ్ర నేతలు

Show comments