Site icon NTV Telugu

Flight Traveling: విమాన ప్రయాణంలో రికార్డు.. 33 ఏళ్లలో 3.7 కోట్ల కిలోమీటర్ల ప్రయాణం

Flight Traveling

Flight Traveling

Flight Traveling: ప్రయాణాలు చేయాలంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. మరికొందరికి ఇష్టంగా ఉంటుంది. ఇంకొందరికి కష్టంగా ఉంటుంది. మరికొందరికీ భయంగా ఉంటుంది. ప్రయాణాలంటే ప్రజలు ఇన్నీ రకాలుగా స్పందిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువ మందికి ప్రయాణాలు చేయాలంటే సరదా.. సంతోషంగా ఉంటుంది. అయితే ప్రయాణం చేసే వాహనాల బట్టి ఎంజాయ్‌మెంట్‌ ఉంటుందనేది వేరే విషయం. కొందరు కారులో ప్రయాణాలను ఇష్టపడతారు.. కొందరు బస్సుల్లో.. మరికొందరు రైళ్లల్లో.. ఇంకొందరు విమానాల్లో ప్రయాణాలు చేయాలంటే బాగా ఇష్టపడతారు. ఇక ఉద్యోగాలు, పని ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక స్తోమత కారణంగా ఎంతో మంది ప్రయాణాలు చేయడానికి వెనక్కి తగ్గుతుంటారు. కొంతమంది మాత్రం ప్రయాణాలే లక్ష్యంగా సాగుతూనే ఉంటారు. రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు దాటి మరీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. రోజుల, నెలలు, సంవత్సరాల తరబడి ప్రయాణిస్తూ కొత్త కొత్త ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అలాగ నిత్యం ప్రయాణాలు చేసే రికార్డు సృష్టించాడో వ్యక్తి. అది కూడా విమానాల్లో ప్రయాణం చేసి ఆయన ఈ రికార్డును సాధించడం విశేషం. ఆయన ఎవరు.. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు.. ప్రయాణాలకు ఎంత ఖర్చు చేశారు.. ఇతర వివరాలు ఏంటనేది తెలుసుకుందాం..

Read also: Tamil Nadu: తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా.. మంత్రి బర్తరఫ్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్‌!

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన టామ్ స్టుకర్ ప్రస్తుత వయస్సు 69 సంవత్సరాలు. టామ్ స్టూకర్ 36 ఏళ్ల వయసులో ఉన్నపుడు అంటే 1990 లో తన విమాన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పటి వరకు సుమారు 23 మిలియన్ మైళ్ల కిలోమీటర్లు అంటే 3.7 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. దీంతో ప్రపంచంలో ఎవరూ ప్రయాణించనంత దూరాన్ని చుట్టి వచ్చిన ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 100 కు పైగా దేశాలలో టామ్ స్టుకర్ పర్యటించాడు. తన భార్యను 120 సార్లు హనీమూన్‌లకు తీసుకెళ్లినట్లు తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు ట్రిప్పులు తిరిగినట్లు టామ్ వెల్లడించాడు. ఒక్క ఆస్ట్రేలియాకే 300 కంటే ఎక్కువ సార్లు ప్రయాణించినట్లు చెప్పాడు. తన పర్యటనలో విలాసవంతమైన హోటళ్లలో టామ్ స్టుకర్ బస చేశాడు. అత్యాధునిక రెస్టారెంట్లలో ప్రత్యేక విందును స్వీకరించాడు. ఇవే కాకుండా క్రిస్టల్ క్రూయిజ్‌లలో కూడా ప్రయాణం చేశాడు. టామ్ స్టుకర్ కార్ డీలర్‌షిప్ కన్సల్టెంట్‌గా పనిచేసేవాడు. 1984 లో పని మీద ఆస్ట్రేలియాకు టామ్ స్టుకర్ ప్రయాణించాడు. అప్పుడే అతనికి ట్రావెలింగ్ మీద ఆసక్తి కలిగిందని పేర్కొన్నాడు. ఆ పర్యటనలో తనకు ఆస్ట్రేలియా దేశం నచ్చిందని.. అందుకో 300 సార్లు అక్కడికి వెళ్లినట్లు చెప్పాడు. ఎవరైనా కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు సెలవులు తీసుకుంటారని.. కానీ తాను మాత్రం.. కేవలం ప్రయాణించడం కోసమే వెళ్తానని వెల్లడించాడు.

Read also: Hair Care Tips For Men: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ జుట్టు మెరిసిపోవడం పక్కా!

1990 లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీసుకువచ్చిన లైఫ్‌టైమ్ పాస్‌ను టామ్ కొనుగోలు చేశాడు. ఈ లైఫ్‌టైమ్ పాస్‌ను టామ్ 2.90 లక్షల అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేశారు. అంటే ఇండియా కరెన్సీలో రూ. 2 కోట్ల 34 లక్షల 94 వేల 680 తో కొన్నాడు. ఈ పాస్‌ను కొనుగోలు చేసిన వారు ఏ ఎయిర్‌లైన్స్‌లో అయినా జీవితకాలం ఉచితంగా ప్రయాణించ వచ్చని ఆ కంపెనీ పాలసీలో ఉంటుందని చెప్పాడు. తనకు విమానంలో ఇష్టమైన సీటు 1B అని తెలిపాడు. తన ప్రతీ ప్రయాణంలో అతడు ఈ 1B సీటులో మాత్రమే ప్రయాణం చేసేవాడు. ఈ లైఫ్‌టైమ్ పాస్‌లో కేవలం విమాన ప్రయాణాలే కాకుండా.. లగ్జరీ హోటళ్లు, హై ఫై రెస్టారెంట్లలో ప్రత్యేక ఫుడ్, క్రిస్టల్ క్రూయిజ్‌లలో ప్రయాణాలు వంటివి అదనంగా అందుతాయి. తన ప్రయాణంలో 2019 సంవత్సరం ఎంతో ప్రత్యేకమని.. అదే అత్యుత్తమ ఏడాది అని టామ్ పేర్కొన్నాడు. ఆ ఒక్క ఏడాదిలోనే 373 విమానాల్లో 1.46 మిలియన్ మైళ్ల దూరం అంటే 23 లక్షల 50 వేల కిలోమీటర్లు ప్రయాణించినట్లు వెల్లడించాడు. తాను గత 33 ఏళ్లుగా చేసిన ప్రయాణాలన్నింటికీ కలిపి 2.44 మిలియన్ అమెరికా డాలర్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఇండియా కరెన్సీలో రూ. 20 కోట్లకు పైగా ఖర్చు చేశాడు. ఈ లైఫ్‌టైమ్ పాస్‌ను ఉపయోగించి 100 కంటే ఎక్కువ దేశాలకు వెళ్లినట్లు గాలిలో ఉండటం కంటే నేలపై ఉండటానికే ఎక్కువ భయపడతానని టామ్ స్టుకర్ చెప్పారు.

Exit mobile version