Sri lanka President: శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పార్లమెంట్ కాంప్లెక్స్‌లో ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన 134 ఓట్లు సాధించి ప్రత్యర్థి డల్లాస్ అలహప్పెరుమాపై గెలుపొందారు. రహస్య బ్యాలెట్ ద్వారా పార్లమెంట్ ఓటింగ్‌లో గెలిచిన వెంటనే, విక్రమసింఘే పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుండి శ్రీలంకను గట్టెక్కించడానికి ప్రతిపక్ష పార్లమెంటేరియన్‌లతో సహా శాసనసభ్యులందరూ ఏకమై తనతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీలంక క్లిష్ట దశలో ఉందని.. యువత, వ్యవస్థ మార్పును కోరుకుంటున్నారని.. పార్లమెంటేరియన్లందరూ కలిసి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని విక్రమసింఘే అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధ్యక్షుడు రణిల్ 2024, నవంబర్ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
225 మంది పార్లమెంటేరియన్లలో, 223 మంది కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఓటు వేశారు. ఇందులో నాలుగు చెల్లని ఓట్లు ఉన్నాయి. మరో ఇద్దరు అభ్యర్థుల ఓటు వేయలేదు. దీంతో 219 ఓట్లకు గానూ 134 ఓట్లు సాధించి శ్రీలంక ద్వీపదేశానికి 8వ అధ్యక్షుడిగా విక్రమసింఘే ఎన్నికయ్యారు. శ్రీలంక పొదుజన పెరమున పార్టీ పార్లమెంటేరియన్ డల్లాస్ అలహప్పెరుమా, నేషనల్ పీపుల్స్ పవర్ నాయకుడు అనుర కుమార దిస్సనాయకేలకు వరుసగా 82 ఓట్లు, 3 ఓట్లు వచ్చాయి.
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిరసనలు వెల్లవెత్తడంతో అధ్యక్ష పదవికి గొటాబయ రాజపక్స రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రధానిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే.. తాత్కాలిక అద్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం అధ్యక్ష పదవికి ప్రకటన వెలువడింది. అయితే 1978 నుండి అంటే గత 44 ఏళ్ల శ్రీలంక చరిత్రలో అధ్యక్షుడిని పార్లమెంట్ నేరుగా ఎన్నుకోవడం ఇదే మొదటిసారి. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రణిల్ విక్రమసింఘే మాట్లాడారు. అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తానని చెప్పారు. 73 ఏళ్ల విక్రమ సింఘేకు అపార అనుభవం ఉంది. ఆరుసార్లు ప్రధాని మంత్రిగా పనిచేశారు.
Insta Reel at Metro Station: తగ్గేదెలే.. నిన్న మెట్రో బయట.. ఇవాళ ఏకంగా మెట్రోలోనే..
దేశాన్ని దివాలా తీయించిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోవడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి గొటబాయ 2024 నవంబరు వరకు పదవిలో ఉండాల్సింది. కాబట్టి ఆయన స్థానంలో కొత్తగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే ఆ గడువు వరకు పదవిలో కొనసాగనున్నారు.
#WATCH Ranil Wickremesinghe takes oath as the President of Sri Lanka pic.twitter.com/xo0txXR0ct
— ANI (@ANI) July 21, 2022