NTV Telugu Site icon

Putin: పుతిన్‌ని ఎలుగుబంటి నుంచి రక్షించిన వ్యక్తికి అత్యున్నత పదవి..

Putin

Putin

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకప్పటి తన పర్సనల్ బాడీగార్డు అయిన అలెక్సీ డ్యూమిన్‌కి అత్యున్నత పదవి కట్టబెట్టారు. 51 ఏళ్ల డ్యూమిన్‌ని స్టేట్ కౌన్సిల్ సెక్రటరీగా పుతిన్ నియమించారు. దేశీయ విదేశాంగ విధానం, వ్యూహాత్మక లక్షణాలు అభివృద్ధి చేయడానికి బాధ్యత వహించే ఈ అత్యున్నత సంస్థలో డ్యూమిన్ కీలకం కానున్నారు. స్టేట్ కౌన్సిల్ ప్రభుత్వ అధికారులు, చట్టసభ సభ్యులు, ప్రాంతీయ నాయకులతో ఉంటుంది.

Read Also: Attempted Murder Case: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, మరో ముగ్గురి అరెస్ట్

71 ఏళ్ల పుతిన్ ఐదోసారి రష్యా అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల నిర్వహించిన పదవుల కేటాయింపుల్లో డ్యూమిన్ రష్యాలోని తులా రీజియన్ నుంచి గవర్నర్‌గా క్రెమ్లిన్‌కి మరింత సన్నిహితంగా మారనున్నారు. 1999 నుంచి పుతిన్ యొక్క వ్యక్తిగత భద్రతలో డ్యూమిన్ పనిచేశారు. అతని సన్నిహిత అంగరక్షకుల్లో ఒకరిగా ఎదిగారు. ఒకప్పుడు ఎలుగుబంటి దాడి నుంచి అధ్యక్షుడు పుతిన్ నుంచి రక్షించాడనే పేరు డ్యూమిన్‌కి ఉంది. పుతిన్‌లో ఐస్ హాకీ ఆడే అత్యంత సన్నిహిత అధికారుల్లో డ్యూమిన్ కూడా ఉన్నారు.

2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను పుతిన్ స్వాధీనం చేసుకోవడంలో డ్యూమిన్ కీలకపాత్ర పోషించారు. రష్యా జీఆర్‌యూ మిలిటరీ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఆపరేషన్ డివిజన్‌‌కి ఇతను డిప్యూటీ హెడ్‌గా పనిచేశారు. మాజీ డిప్యూటీ డిఫెన్స్ మినిష్టర్‌గా పనిచేసిన డ్యూమిన్‌పై ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఇటీవల పుతిన్ తన దీర్ఘకాల మిత్రుడు సెర్గీ షోయిగును రక్షణ మంత్రిగా తొలగించారు. ఈ నిర్ణయం తర్వాత డ్యూమిన్ పదోన్నతి పొందారు. సెర్గీ షోయిగు స్థానంలో కొత్త రక్షణ మంత్రిగా మాజీ ఉప ప్రధాని ఆండ్రీ బెలౌసోవ్‌ని రక్షణ మంత్రిగా నియమించారు.