Site icon NTV Telugu

Pakistan: పాక్ ప్రధాని షరీఫ్‌కు ఘోర అవమానం.. పట్టించుకోని పుతిన్..

Shahbaz Sharif

Shahbaz Sharif

Pakistan: పాకిస్తాన్, అంతర్జాతీయ పరువు పోగొట్టుకోవడం అనవాయితీగా మార్చుకుంది. ఆ దేశం నుంచి ప్రధానితో పాటు ఎవరూ విదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ అవమానం ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా, తుర్క్‌మెనిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ ట్రస్ట్ ఫోరం సదస్సులో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల, భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఎంత సన్నిహితంగా ఉన్నారో చూశాం. కానీ, పాక్ ప్రధాని షరీఫ్‌ను కలిసేందుకు మాత్రం పుతిన్ ఆసక్తి చూపించలేదు.

Read Also: Messi Hyderabad Schedule: హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

పుతిన్‌ను కలిసేందుకు షరీఫ్ నానా ప్రయత్నాలు చేసినా కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఏకంగా 40 నిమిషాల పాటు పుతిన్‌తో సమావేశం కోసం ఎదురుచూశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మీటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో షరీఫ్ తీవ్ర అసహనంగా ఉన్నారు. భారత పర్యటనకు వచ్చిన పుతిన్‌‌ను ప్రధాని మోడీ స్వయంగా ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతించారు. ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణించారు.

40 నిమిషాల నిరీక్షణ తర్వాత, ఇంకా మీటింగ్ ఎప్పుడు అవుతుంది అని షరీఫ్ అధికారుల్ని పదే పదే అడగడం వీడియోలో కనిపిస్తోంది. చివరకు పుతిన్ రాకపోవడంతో షరీఫ్, ఆయనను కలవకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇది పాక్ ప్రధానికి జరిగిన ఘోరమైన దౌత్య అవమానం. ఒక దేశాధినేతను పుతిన్ పట్టించుకోలేదు. పుతిన్ మాత్రమే కాదు, దివాళా అంచున ఉన్న, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు.

Exit mobile version