Pakistan: పాక్ ప్రధాని షరీఫ్‌కు ఘోర అవమానం.. పట్టించుకోని పుతిన్..
- పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఘోర అవమానం..
- 40 నిమిషాలు వేచిచూసినా పట్టించుకోని పుతిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్, అంతర్జాతీయ పరువు పోగొట్టుకోవడం అనవాయితీగా మార్చుకుంది. ఆ దేశం నుంచి ప్రధానితో పాటు ఎవరూ విదేశాలకు వెళ్లిన అంతర్జాతీయ అవమానం ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా, తుర్క్‌మెనిస్తాన్‌లో జరిగిన ఓ సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఇంటర్నేషనల్ పీస్ అండ్ ట్రస్ట్ ఫోరం సదస్సులో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల, భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీతో ఎంత సన్నిహితంగా ఉన్నారో చూశాం. కానీ, పాక్ ప్రధాని షరీఫ్‌ను కలిసేందుకు మాత్రం పుతిన్ ఆసక్తి చూపించలేదు.
Read Also: Messi Hyderabad Schedule: హైదరాబాద్‌లో మెస్సీ సందడి.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
Also Read
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
పుతిన్‌ను కలిసేందుకు షరీఫ్ నానా ప్రయత్నాలు చేసినా కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఏకంగా 40 నిమిషాల పాటు పుతిన్‌తో సమావేశం కోసం ఎదురుచూశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పుతిన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో మీటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో షరీఫ్ తీవ్ర అసహనంగా ఉన్నారు. భారత పర్యటనకు వచ్చిన పుతిన్‌ను ప్రధాని మోడీ స్వయంగా ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగతించారు. ఒకే కారులో మోడీ, పుతిన్ ప్రయాణించారు.
40 నిమిషాల నిరీక్షణ తర్వాత, ఇంకా మీటింగ్ ఎప్పుడు అవుతుంది అని షరీఫ్ అధికారుల్ని పదే పదే అడగడం వీడియోలో కనిపిస్తోంది. చివరకు పుతిన్ రాకపోవడంతో షరీఫ్, ఆయనను కలవకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇది పాక్ ప్రధానికి జరిగిన ఘోరమైన దౌత్య అవమానం. ఒక దేశాధినేతను పుతిన్ పట్టించుకోలేదు. పుతిన్ మాత్రమే కాదు, దివాళా అంచున ఉన్న, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది దేశాన్ని ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు.
#Putin kept #ShehbazSharif waiting for 40 minutes… at the end poor guy barged into Putin–Erdogan’s meeting uninvited. 🤣…Only to walk out in 10 minutes #Pakistan’s global respect hits new highs. 😂🤌 pic.twitter.com/IrpWdVHDiA
— Amit Sahu🇮🇳 (@amitsahujourno) December 12, 2025
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!