NTV Telugu Site icon

Russia: పుతిన్ సంచలన నిర్ణయం.. ఫిన్లాండ్ సరిహద్దుల్లో రష్యా బలగాల మోహరింపు..

Russia

Russia

Russia: ఓ వైపు రెండేళ్లు గడుస్తున్నా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. మరోవైపు ఫిన్లాండ్- రష్యా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఫిన్లాండ్ సరిహద్దుల్లో తమ దళాలను, స్ట్రైక్ సిస్టమ్‌లను మోహరిస్తామని రష్యా అధినేత పుతిన్ చెప్పినట్లు ఆల్ జజీరా నివేదించింది. నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరడంపై పుతిన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిన్లాండ్‌తో పాటు స్వీడన్ నాటోలో చేరడాన్ని ‘అర్థం లేని అడుగు’గా అభివర్ణించారు. రష్యా స్టేట్ మీడియా రోసియా-1 టెలివిజన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుత.. ఈ రెండు దేశాలవి పూర్తి అర్థరహితమైన చర్యగా చెప్పారు.

Read Also: Pakistan: దేశం కోసం పాక్ అధ్యక్షుడు జర్దారీ కీలక నిర్ణయం

ఫిన్లాండ్ సరిహద్దులో ప్రస్తుతం మా బలగాలు లేవని, ప్రస్తుతం బలగాలను మోహరిస్తామని పుతిన్ చెప్పారు. రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం తర్వాత తటస్థంగా ఉన్న స్వీడన్ అమెరికా నేతృత్వంలోని నాటోలో చేరాలని నిర్ణయించుకుంది. స్వీడన్ పొరుగున ఉన్న ఫిన్లాండ్ గతేడాది ఏప్రిల్ 4న నాటోలో సభ్యతం పొందింది. ఈ రెండు నార్డిక్ దేశాలతో నాటో కూటమి మొత్తం బాల్టిక్ సముద్రాన్ని నియంత్రిస్తుంది.