బీజింగ్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ప్రారంభం సమయంలో క్రీడాకారులు పరేడ్ ను నిర్వహించారు. అయితే, పరేడ్‌లో ఉక్రెయిన్ క్రీడాకారులు జాతీయ పతాకం పట్టుకొని మార్చ్ చేసే సమయంలో సడెన్ గా రష్యా అధ్యక్షుడు కునుకు తీశారు. ఆ తరువాత లేచి థంప్ చూపించారు. ఈ మెగా ఈవెంట్‌లో రష్యా క్రీడాకారులు పాల్గొనలేదు. డోపింగ్ ఆరోపణలతో రష్యా క్రీడాకారులు మెగా ఈవెంట్లలో పాల్గొనడం లేదు. అయితే, రష్యా ఒలింపిక్స్ కమిటి ఈ ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నది.
Read: మహారాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమైన అన్నాహజారే…
అయితే, ఉక్రెయిన్ జట్టు వచ్చినపుడు కావాలనే పుతిన్ కునుకుతీసినట్లు నటించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే, రష్యా- ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాల్లో రష్యా తన సైన్యాన్ని మోహరిస్తున్నది. అటు నాటో దళాలు సైతం ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న తరుణంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి.