Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన
- అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- మధ్య ఆసియాలో ఇదే తొలి అణు ప్లాంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ కజకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజధాని అస్తానాలో కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్‌తో పుతిన్ సమావేశమయ్యారు. ఇక పర్యటనలో భాగంగా మధ్య ఆసియా దేశమైన కజకిస్థాన్‌లో తొలి అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా-కజకిస్థాన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారీ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన టోకాయెవ్.. “ఈ రోజు కుదిరిన బాల్కాష్ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణ ఒప్పందం ఎంతో ప్రాధాన్యత కలిగినది” అని పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అమలులో రష్యా అందిస్తున్న సహకారానికి పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రష్యా ఎగుమతి రుణ సాయం కూడా అందించనుంది. కజకిస్థాన్ అణుశక్తి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 15 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 85 శాతం నిధులను రష్యానే సమకూర్చనుంది. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని కజకిస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలోని బాల్కాష్ సరస్సు తీరంలో ఉన్న ఉల్కెన్ గ్రామం సమీపంలో నిర్మించనున్నారు. ఇందులో రెండు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- US-Iran War: పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ఒప్పందం ముగిసినట్లే? ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
- US-Iran: తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్‌హౌస్ ఖండన
ప్రపంచంలోనే అత్యధిక యురేనియం ఉత్పత్తి చేసే దేశంగా కజకిస్థాన్‌కు గుర్తింపు ఉంది. అయినప్పటికీ అణు విద్యుత్ వినియోగంపై గత రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో చర్చలు సాగుతున్నాయి. సోవియట్ కాలంలో జరిగిన అణు పరీక్షల వల్ల పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో కజకిస్థాన్ ఇప్పటి వరకు అణు విద్యుత్ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించింది. అయితే 2024లో నిర్వహించిన జాతీయ ప్రజాభిప్రాయ సేకరణలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో ఇప్పుడు రష్యాతో కలిసి ఈ ప్రాజెక్ట్ అమలు దిశగా కజకిస్థాన్ అడుగులు వేస్తోంది.
సుమారు 2.05 కోట్ల జనాభా కలిగిన కజకిస్థాన్.. 2035 నాటికి 2.4 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి వనరులను విభిన్నీకరించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్‌ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
ట్రెండింగ్
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!