Putin: కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన.. అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- కజకిస్థాన్‌లో పుతిన్ పర్యటన
- అణు విద్యుత్ శక్తిపై కీలక ఒప్పందం
- మధ్య ఆసియాలో ఇదే తొలి అణు ప్లాంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ కజకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రాజధాని అస్తానాలో కజకిస్థాన్ అధ్యక్షుడు కాసిమ్-జొమార్ట్ టోకాయెవ్‌తో పుతిన్ సమావేశమయ్యారు. ఇక పర్యటనలో భాగంగా మధ్య ఆసియా దేశమైన కజకిస్థాన్‌లో తొలి అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి రష్యా-కజకిస్థాన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారీ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఈ సందర్భంగా మాట్లాడిన టోకాయెవ్.. “ఈ రోజు కుదిరిన బాల్కాష్ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణ ఒప్పందం ఎంతో ప్రాధాన్యత కలిగినది” అని పేర్కొన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ అమలులో రష్యా అందిస్తున్న సహకారానికి పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రష్యా ఎగుమతి రుణ సాయం కూడా అందించనుంది. కజకిస్థాన్ అణుశక్తి సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 15 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టులో దాదాపు 85 శాతం నిధులను రష్యానే సమకూర్చనుంది. ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని కజకిస్థాన్ ఆగ్నేయ ప్రాంతంలోని బాల్కాష్ సరస్సు తీరంలో ఉన్న ఉల్కెన్ గ్రామం సమీపంలో నిర్మించనున్నారు. ఇందులో రెండు అణు రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read
ప్రపంచంలోనే అత్యధిక యురేనియం ఉత్పత్తి చేసే దేశంగా కజకిస్థాన్‌కు గుర్తింపు ఉంది. అయినప్పటికీ అణు విద్యుత్ వినియోగంపై గత రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో చర్చలు సాగుతున్నాయి. సోవియట్ కాలంలో జరిగిన అణు పరీక్షల వల్ల పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడటంతో కజకిస్థాన్ ఇప్పటి వరకు అణు విద్యుత్ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించింది. అయితే 2024లో నిర్వహించిన జాతీయ ప్రజాభిప్రాయ సేకరణలో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ప్రజలు మద్దతు తెలిపారు. దీంతో ఇప్పుడు రష్యాతో కలిసి ఈ ప్రాజెక్ట్ అమలు దిశగా కజకిస్థాన్ అడుగులు వేస్తోంది.
సుమారు 2.05 కోట్ల జనాభా కలిగిన కజకిస్థాన్.. 2035 నాటికి 2.4 గిగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలిక ఇంధన వ్యూహంలో భాగంగా విద్యుత్ ఉత్పత్తి వనరులను విభిన్నీకరించేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!