Site icon NTV Telugu

Russia President Putin: పుతిన్‌ దక్షిణాఫ్రికా పర్యటన రద్దు.. ఎందుకంటే..?

Putin

Putin

Russia President Putin: కొన్ని ఘటనల నేపథ్యంలో దేశాల అధ్యక్షులు తమ విదేశాల పర్యటనలను రద్దు చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్‌కు సహాయ, సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ అరెస్టుకు ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్‌ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారని ఆయా దేశాల ప్రతినిధులు చెబుతున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బదులుగా రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా తరఫున బ్రిక్స్‌ సదస్సులో విదేశాంగ శాఖ మంత్రి పాల్గొననున్నారు.

Read also: Shubman Gill: యువరాజ్ సింగ్ చెప్పాడనే ఓకే చెప్పా.. అసలు విషయం చెప్పేసిన శుభ్‌మన్ గిల్!

ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ICC) ఈ ఏడాది మార్చి నెలలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో పుతిన్‌ తన దేశం దాటి వస్తే అరెస్టయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న బ్రిక్స్‌ దేశాల 15వ సదస్సుకు హాజరుకావాల్సి ఉన్నా పుతిన్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తనకు బదులుగా తన విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు పంపనున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్‌ దేశాల 15వ సదస్సు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు బ్రిక్స్‌ సభ్యదేశాల ప్రతినిధులందరూ హాజరుకానున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా ప్రకటించారు. తాము సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Exit mobile version