Site icon NTV Telugu

Gambia: ఆఫ్రికాలో 66 మంది చిన్నారుల మృతి.. భారత ఔషధాలపై దర్యాప్తు

Cough Syrup

Cough Syrup

Probing 4 Indian Cough Syrups After 66 Children Die In Gambia: దగ్గు, జలుబు మందు వాడటం వల్ల ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. భారతదేశానికి చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్ తయారు చేసిన నాలుగు దగ్గు మందులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మరణాలకు సదురు మందులే కారణం అని డబ్యూహెచ్ఓ హెచ్చరించింది. కలుషితమైన మందులు పశ్చిమ ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసి ఉండవచ్చని భావిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టడ్రోస్ అధనామ్ ఘేబ్రియెసస్ మాట్లాడుతూ.. నాలుగు జలుబు, దగ్గు సిరప్ లు తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, పిల్లల మరణాలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. డబ్యూహెచ్ఓ భారతీయ కంపెనీ, నియంత్రణ అధికారులతో తదుపరి విచారణ నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ప్రొమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ మందులపై డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్ ప్రకటించింది.

Read Also: Eknath Shinde: నేను “కట్టప్ప”నే కావచ్చు.. కానీ మీలాగ మాత్రం కాదు.. ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు

ఈ నాలుగు ఉత్పత్తుల భద్రత, నాణ్యతపై ఈ రోజ వరకు తయారీ సంస్థ డబ్ల్యూహెచ్ఓకు హామీ ఇవ్వలేదని.. పరిశోధనల్లో ఈ మందులు ఆమోదయోగ్యంకానీ డైథైలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌ను కలిగి ఉన్నాయని పేర్కొంది. ఈ పదార్థాల వల్ల మానవుడిలో తీవ్ర అనారోగ్య సమస్యలు సంభవించవచ్చని.. ప్రాణాంతంక కావచ్చని తెలిపింది. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, మానసిక స్థితిపై ప్రభావం చూపించి మూత్రపిండాల వైఫల్యానికి కారణం కావచ్చని తెలిపింది.

గతంలో 28 మంది పిల్లలు కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మరణించిన తర్వాత గాంబియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పారసెటమాల్ వాడటాన్ని మానేయాలని ఆదేశించింది. భారత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అందిన సమాచారం ప్రకారం తయారీదారు కలుషితమైన మందులను గాంబియాకు మాత్రమే సరఫరా చేసినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అనధికార మార్గాల ద్వారా ఈ ఉత్పత్తులు ఆఫ్రికా, ఇతర దేశాలకు సరఫరా చేయడాన్ని తోసిపుచ్చలేమని తెలిపింది. ఈ మందులను రోగులకు హాని కలిగించకుండా చెలామణి ుంచి తొలగించడానికి అన్ని దేశాలు కృషి చేయాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.

Exit mobile version