Site icon NTV Telugu

మహిళలను హింసించడం దేవుడ్ని అవమానించినట్టే: పోప్ ఫ్రాన్సిస్‌

మహిళలను హింసించడం.. దేవుడ్ని అవమానించినట్లేనని నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోప్‌ ఫ్రాన్సిస్‌ సందేశమిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింసకు ముగింపు పలకాలంటూ పిలుపునిచ్చారు. సెయింట్‌ పీటర్స్‌ బసలీకా రోమన్‌ కాథలిక్‌లో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరాధన నిర్వహించారు.

Read Also క్రిస్ గేల్‌కు షాకిచ్చిన వెస్టిండీస్ బోర్డు

అలాగే నూతన వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగంలో మాతృత్వం, స్త్రీల సమస్యల గురించి ప్రస్తావించారు. జీవితాలు వీరితోనే ముడిపడి ఉన్నాయని అన్నారు. వారిపై హింసను ముగింపు పలకాలని బలమైన సందేశాన్ని ఇచ్చారు. ‘ మాతృమూర్తి జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రపంచాన్ని కలిపి ఉంచేది మహిళలే కాబట్టి.. వారిని ప్రోత్సహించాలి. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎక్కువ ప్రయత్నాలు చేద్దాం’ అని ప్రాన్సిస్‌ అన్నారు.

Exit mobile version