Site icon NTV Telugu

Shocking: పోలెండ్ బోర్డ‌ర్‌లో పోలీసుల అరాచ‌కం… విద్యార్థుల‌ను కాళ్ల‌తో త‌న్నుతూ…

ఉక్రెయిన్‌లో యుద్ధం జ‌రుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆ దేశం నుంచి ఎలాగోలా త‌ప్పించుకొని బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఉక్రెయిన్‌కు స‌మీపంలో ఉన్న పోలెండ్ బోర్డ‌ర్‌కు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి పోలెండ్ బోర్డ‌ర్‌లోకి వ‌చ్చే వారికి ఎలాంటి వీసాలు అవ‌స‌రం లేద‌ని, డైరెక్ట్‌గా ర‌ష్యా నుంచి ఉక్రెయిన్‌లోకి రావొచ్చ‌ని స్ప‌ష్టం అధికారులు స్ప‌ష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులు పోలెండ్ బోర్డ‌ర్‌కు చేరుకుంటున్నారు. అయితే, పోలెండ్ బోర్డ్‌ర్‌కు చేరుకున్న విద్యార్థుల‌ను అక్క‌డి బోర్డర్‌లో సైనికులు, పోలీసులు అడ్డుకుంటున్నారు. విదేశీ విద్యార్థుల‌ను కాళ్ల‌తో త‌న్నుతూ హింసిస్తున్నారు. కాళ్ల‌కు మొక్కితేనే మ‌హిళ‌ల‌ను పోలెండ్‌లోకి అనుమ‌తిస్తున్నారు. తాము చెప్పిన‌ట్టు వింటేనే పోలెండ్‌లోకి అడుగు పెట్టేందుకు అనుమ‌తిస్తామ‌ని పురుషుల‌ను హెచ్చ‌రిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియాకు చెందిన ఓ విద్యార్థిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైర‌ల్ అవుతున్న‌ది.

Read: Viral: యుద్ధం చేస్తూనే లూటీలు చేస్తున్నారు..

Exit mobile version