NTV Telugu Site icon

లైవ్‌లో క‌రోనాను ఎక్కించుకుంటానన్న ప్ర‌ధాని…సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…

క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్న‌దో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  మ‌హమ్మారి మొద‌టి వేవ్‌ను దాదాపుగా అన్ని దేశాలు లైట్‌గా తీసుకోవ‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింది.  అటు బ్రిట‌న్ కూడా ఈ మ‌హమ్మారిని లైట్‌గా తీసుకున్న‌ది.  ప్ర‌జ‌ల్లో భ‌యాంధోళ‌న‌లు క‌లిగించ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో బ్రిట‌న్ ప్ర‌ధాని లైవ్‌లో క‌రోనా వైర‌స్‌ను ఎక్కించుకుంటాన‌ని ఆయ‌న స‌న్నిహితులతో చెప్పార‌ట‌.  ఈ విష‌యాన్ని ఎయిడ్ డొమినిక్ క‌మ్మిన్స్ బ‌య‌ట‌పెట్టారు.  ప్ర‌జ‌ల్లో భ‌యం పోగొట్టేందుకు ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ అలా చెప్పిన‌ట్టు కమ్మిన్స్ పేర్కోన్నారు.  క‌మ్మిన్స్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.  ఆ త‌రువాత ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ క‌రోనా బారిన ప‌డ‌టం,  బ్రిట‌న్‌లో కేసులు పెరిగిపోవ‌డంతో జాన్స‌న్‌కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.