బంగ్లాదేశ్ ప్రజల చిరకాల కల ఈ బ్రిడ్జ్. ఎన్నో అడ్డంకులు దాటుకుని తాజాగా శనివారం ప్రారంభం అయింది. దేశ ప్రధాని షేక్ హసీనా దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు, రైలు వంతెనను ప్రారంభించారు. పూర్తిగా దేశీయ నిధులతో ఎలాంటి విదేశీ సాయం లేకుండా ఈ వంతెన నిర్మించారు. రాజధాని ఢాకాతో నైరుతి బంగ్లాదేశ్ ను కలిపేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో సహాయపడుతుంది. పద్మ నదిపై 6.15 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల రోడ్డు-రైలు వంతెనను నిర్మించారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఈ వంతెన కోసం 3.6 మిలియన్ డాలర్లను వెచ్చించింది. చాలా మంది ఆర్థిక నిపుణుల అంచనాలను తలకిందులుగా చేస్తూ పూర్తిగా దేశీయ వనరులపై ఆధారపడి అక్కడి షేక్ హసీనా ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించింది. పద్మ వంతెనలో భాగస్వామ్యం అయిన అందరికి ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ వంతెనను కలగా పిచిన వారికి ఆత్మవిశ్వాసం లేదని భావిస్తున్నట్లు.. ఈ వంతెన కేవలం ఇటుకలు, సిమెంట్, ఇనుము, కాంక్రీట్ మాత్రమే కాదని.. ఇది మన గర్వం, మన సామర్థ్యం, మన బలం, మన గౌరవానికి చిహ్నం అని.. ఈ వంతెన బంగ్లాదేశ్ ప్రజలకు చెందినదని అన్నారు. పద్మ వంతెన నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడారు.
అయితే ఈ ప్రాజెక్ట్ కోస ముందుగా వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం నిధులు సమకూరుస్తుందని అనుకున్నప్పటికీ.. 2012లో బంగ్లాదేశ్ అధికారులల అవినీతి కారణాన్ని చూపిస్తూ క్రెడిట్ ను రద్దు చేసింది. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను తిరస్కరించింది. నిధుల కోసం అంతర్జాతీయ రుణదాతలను సంప్రదించకూడదని.. దేశీయంగానే వంతెన నిర్మించాలని భావించి విజయం సాధించింది.