Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు పోయిన తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు, పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి జరిగనప్పటి నుంచి పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. బయటికి మాత్రం ఆ దేశ రాజకీయ నేతలు పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తూ, అక్కడి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్పితే, లోలోపల మాత్రం భారత్ ఏం చేస్తుందో అని భయపడుతున్నారు.
Read Also: GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్‌హెచ్ ముందు భారీ టార్గెట్!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ సాయం కోరుతోంది. ఇప్పటికే, చైనా, రష్యాల సాయం కోరింది. ఈ దాడిపై తటస్థ, పారదర్శక విచారణకు సహకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడారు. ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ రోజు పాక్ ప్రధాని సౌదీ అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాలను కోరారు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాం కోసం పాకిస్తాన్ పనిచేస్తుంది అని పునరుద్ఘాటించారు’’ అని పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్-మాలికితో సమావేశంలో పాక్ ప్రధాని చెప్పిటన్లు పీఎం ఆఫీస్ ప్రకటన తెలిపింది. పాకిస్తాన్‌లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమద్ ఒబైద్ ఇబ్రహీం సలేం అల్-జాబీతో కూడా పాక్ ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ అబ్దుల్ రెహ్మాన్ జాసన్‌కి కూడా కలిశారు.
